టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క వరుస సినిమాల్లో నటిస్తూనే మరో పక్క కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అలానే ఎక్కువగా యాక్షన్ యాడ్స్ లో నటించి మహేష్.. తొలిసారిగా తమన్నాతో కలిసి ఓ రొమాంటిక్ యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహేష్ బాబు, తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీనువెట్ల దర్శకత్వంలో ‘ఆగడు’ సినిమాలో వీరిద్దరు కలసి నటించారు. అలానే ‘సరిలేరు నీకెవ్వరూ’ లో ఐటెం సాంగ్ లోనూ మహేష్ బాబుతో కలిసి ఈ అమ్మడు చిందులేసింది. అయితే తాజాగా మహేష్ బాబుపై మిల్కీబ్యూటీ తమన్న చాలా కేర్ తీసుకుంది. “నువ్వు నా ప్రాణం కదా.. బాగా చూసుకోవాలి” అంటూ మహేష్ బాబుపై ఈ అమ్మడు ప్రేమను చూపింది. అయితే ఇదంతా రియల్ కాదండి బాబు.. ఓ యాడ్ లో భాగంగా తమన్నా.. మహేష్ బాబుపై ఇలా ప్రేమను కురిపించింది. ప్రస్తుతం ఈ యాడ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాల్లో నటిస్తూనే మరో పక్క కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఒకసారి టీవీ ఆన్ చేస్తే మహేష్ బాబుకు సంబంధించిన యాడ్స్ఎక్కువగా కనిపిస్తాయి. ఆయన నటించిన థమ్సప్ యాడ్, మౌంటైన్ డ్యూ యాడ్ తో పాటు మరికొన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ యాడ్స్ లో మహేష్ బాబు రిస్కీ షాట్స్ లో పాల్గొన్నట్టు చూపించారు. అలానే థమ్సప్, మౌంటైన్ డ్యూ యాడ్స్ లో అంతా మహేష్ యాక్షన్ సీన్లే చేశారు. అయితే మొట్టమొదటి సారిగా ఓ యాడ్ లో తమన్నాతో రొమాంటిక్ గా నటించారు.
లాయిడ్ అనే ఏసీ కంపెనీకి చెందిన యాడ్ లో వీరిద్దరు ఎంతో రొమాటింక్ గా నటించారు. వీరిద్దరి మధ్య సాగిన రొమాంటిక్ సంభాషణ అందరిని ఆకట్టుకుంది. అలానే ఈ యాడ్ లో తమన్నా.. తన లుక్స్ తో కుర్రాళ్లకు మతిపొగొట్టింది. ఈ సీన్లు సినిమాలో పడి ఉంటే… ఓ రేంజ్ లో ఉండేదని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు యాక్షన్ తరహా యాడ్ లో నటించిన మహేష్ బాబు… తమన్నాతో కలిసి రొమాంటిక్ యాడ్ లో నటించి ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు. ఈ యాడ్ లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పడిందని చాలా మంది అభిప్రాయాపడుతున్నారు.
ఇక యాడ్ లో భాగంగా.. ఇంత ఎండలో కూడా ఏంటి కారును క్లీన్ చేస్తావంటూ తమన్నా అంటుంది. “ఇది నా ప్రాణం.. బాగా చూసుకోవాలి కదా అంటూ మహేష్ బాబు సమాధానం ఇస్తాడు. అయితే మహేష్ బాబు ఇంట్లోకి రాగానే ఏసీ ఆన్ చేస్తుంది. దీంతో మహేష్ బాబు చాలా కూల్ అయిపోతారు. దీంతో అయన వద్దకు వెళ్లిన తమన్నా… “నువ్వు నా ప్రాణం.. నిన్ను బాగా చూసుకోవాలి కదా?” అని అంటుంది. ప్రస్తుతం వీరిద్దరు నటించిన ఈ రొమాంటిక్ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.