తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ‘విష్ణు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మంచు విష్ణు మొదటి చిత్రం పెద్ద హిట్ కాకున్నా నటుడిగా మంచి మార్కులు సంపాదించాడు. మంచు విష్ణు కెరీర్ లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఢీ’సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత మంచు విష్ణుకి చెప్పుకోదగ్గ హిట్స్ ఏవీ లేవు. ప్రస్తుతం జిన్నా చిత్రంతో ప్రేక్షకులు ముందుక రాబోతున్నాడు.
గత ఏడాది మా అసోసియేషన్ లో జరిగిన ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యర్థుల మద్య మాటల యుద్దం నడిచింది. అంతేకాదు ఇండస్ట్రీలో లోకల్ నాన్ లోకల్ అనే వ్యవహారంపై కూడా రచ్చ జరిగింది. మొత్తానికి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యాడు. మా అధ్యక్షుడిగా ఎన్నికై సంవత్సరం పూర్తయిన సందర్భంగా తన ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు మంచు విష్ణు.
తాను మా ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలు సంవత్సర కాలంలో 90 శాతం వరకు పూర్తి చేశానని.. గతంలో మా అసోసియేషన్ కొన్ని రూల్స్ ఉన్నాయి.. లిగల్ ఒపీనియన్ తీసుకొని వాటిని తీసేస్తున్నాం.. అందులో నెలకు వంద రూపాయలు చెల్లించే విషయం ఒకటి. పెద్ద పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్లి ప్రతిసారీ వందరూపాయలు చెల్లించాలని అడగలేము కదా.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అలాగే పెన్షన్ విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు.
మా అసోసియేషన్ లో సభ్యుత్వం ఉన్న నటులకు సినిమాల్లో అవకాశం వచ్చేందుకు చర్యలు తీసుకుంటానని.. ఇందుకోసం ఒక ప్రత్యేక యాప్ ని రూపొందిన్నామని అన్నారు. ‘మా’ అసోసియేషన్ కి సంబంధించిన ఈ యాప్ లో సినిమాలకు సంబంధించిన ప్రతి వివరాలు తెలుసుకోవచ్చని.. అలాగే ప్రొడక్షన్ సంస్థల్ని నేరుగా కలుసుకోవచ్చని అన్నారు. అంతేకాదు తాము మహిళలకు ఎంతో గౌరవం ఇస్తామని.. మహిళా సంరక్షణ కోసం ప్రత్యేక కమిటీ తయారు చేశామని మంచు విష్ణు తెలిపారు.
ఇక ‘మా’ అసోసియేషన్ కి సరైన బిల్డింగ్ లేదని అంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉన్న ఫిలిమ్ ఛాంబర్ బిల్డింగ్ ని కూల్చి వేసి అన్ని సౌకర్యాలతో కొత్త బిల్డింగ్ నిర్మించాలని యోచిస్తున్నామని.. అందుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని అన్నాడు. ఇక మా అసోసియేషన్ లో సభ్యత్వం ఉన్నవారికే సినిమా ఛాన్సులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని.. ఎవరైనా ప్రలోభాలకు లోబడి ధర్నాలు చేస్తూ మీడియాలో రచ్చ చేస్తే మాత్రం వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తామని అన్నారు.
ఇది చదవండి : ఇండస్ట్రీలో అవకాశాలపై నిధి అగర్వాల్ ఓపెన్ కామెంట్స్!