ప్రియాంక కామత్.. 'గిచ్చి గిలి గిలి' షో చేస్తూ కన్నడలో లేడి కామెడియన్‌గా లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది. తన కామెడి టైమింగుతో కడుపుబ్బ నవ్విస్తుంది. తనకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. వివిధ కార్యక్రమాలు చేస్తూ.. హ్యాపీగా సాగిపోతున్న టైమ్‌లో
ప్రియాంక కామత్.. ‘గిచ్చి గిలి గిలి’ షో చేస్తూ కన్నడలో లేడీ కామెడియన్‌గా లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది. తన కామెడీ టైమింగుతో కడుపుబ్బ నవ్విస్తుంది. తనకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. వివిధ కార్యక్రమాలు చేస్తూ.. హ్యాపీగా సాగిపోతున్న టైమ్‌లో ప్రియాంక అనారోగ్యానికి గురైంది. ఆమె బ్రతకదని చాలా మంది డాక్టర్స్ తేల్చి చెప్పారు. ఇలా చావు అంచులదాకా వెళ్లొచ్చిన ప్రియాంక.. తన ప్రియుడి అండతో చావుని ఎదురించి నిలబడింది. అసలు అమెకు ఏమైంది అనుకుంటున్నారా.. గతేడాది డిసెంబర్‌లో ప్రియుడు అమిత్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంకకు వెన్నుముక సంబంధించిన సమస్యతో బాధపడింది.
ప్రియాంకకు వచ్చింది చిన్న సమస్య కాదు.. అమె దాదాపు నడవలేని స్థితికి చేరుకుంది. అమె ఏకంగా 8 నెలలు బెడ్ మీదనే ఉంది. అలా.. కొన్ని నెలలు నరకం చూసింది. ఎన్నో కష్టాలను ఓర్చుకుని అనారోగ్యం నుంచి కోలుకుని ఇప్పుడు హ్యాపీగా ఉంది. ప్రియాంక కామత్ తన ఆనారోగ్యం గురించి మాట్లాడుతూ.. “ఈ ఆపద సమయంలో తన భర్త తనకు అండగా నిలిచారని గర్వంగా చెపుతుంది. నా భర్తే నాకు మరో జన్మను ప్రసాదించాడు. నాకు నిశ్చితార్ధం జరిగిన తరువాత ఈ సమస్య వచ్చింది.. ఇంకెవరైనా అయితే నాతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని.. మరొకరిని చూసుకునేవారు. కానీ.. నా భర్త నన్ను తన భార్యగా భావించాడు. కాబట్టే.. పెళ్ళికి ముందు నుండి నా కష్టంలో తోడుగా ఉంటూ వచ్చాడు.’ అని పేర్కొంది.
‘నిజానికి.. నా వెన్నుముక చికిత్స తరువాత కూడా మరో రెండు చికిత్సలు జరిగాయి. నా శరీరానికి 70 శాతం ఇన్పెక్షన్ వచ్చింది. నేను బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. నా శరీరంలో స్క్రూలు, రాడ్లు ఫిక్స్ చేశారు. అప్పుడు నేను 8 నెలలు బెడ్ మీదనుంచి కదలలేని పరిస్ధితి. నేను ఏపని చేసుకోలేక పోయేదాన్ని. చాలా కష్టం అనిపించేది. ఎటూ కదలలేని పరిస్ధితి. నాకు ఈ లైఫ్ ఎందుకిచ్చావ్ దేవుడా అని ఏడ్చేదాన్ని. ఇంత నరకం అనుభవించే సమయంలో కూడా అమిత్ ప్రతిక్షణం నాతోనే ఉండేవాడు. నా డ్రెస్సింగ్, డైపర్ ప్యాడ్లు మార్చేవాడు. నన్ను చంటి పిల్లలా చూసుకునేవాడు. ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం” అంటూ ఎమోషనల్ అయ్యింది ప్రియాంక కామత్. మరి రాబోయే రోజుల్లో ప్రియాంక మనుపటిలా మళ్లీ టెలివిజన్ షోలు చేస్తుందా? లేదా అన్నది చూడాలి.