‘పొన్నియన్ సెల్వన్’.. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్‌లో గ్రాండ్ కాస్టింగ్‌తో ఎంతో అద్భుతంగా ప్రెజెంట్ చేసిన సినిమా ఇది. ఈ సినిమాని ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీలో చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, జయం రవి, త్రిష, ప్రభు, ప్రకాశ్ రాజ్ వంటి ఎంతో గొప్ప తారాగణం ఉంది. విజువల్ వండర్‌గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా అటు తమిళ్‌లోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రిలీజైన మూడు రోజులకే ఈ సినిమా కలెక్షన్స్ పరంగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. 200 కోట్ల క్లబ్ లో చేరడమే కాదు.. మొదటి 3 రోజుల్లో తమిళ్ నుంచి వచ్చిన సినిమాల్లో 200 కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యానికి గురించేసింది. వలిమై, విక్రమ్ మినహా అన్ని తమిళ్ సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్స్ రాబట్టేసింది.
అయితే ఈ సినిమా విషయంలో కోలివుడ్ పెద్దలు కొందరు, పలువురు ప్రముఖులు టాలీవుడ్‌పై పలు విమర్శలు చేయడం, పెదవి విరవడం ప్రారంభించారు. ఒక్క విమర్శలతో ఆగకుండా మీ సినిమాలు తమిళ్‌లో ఎలా ఆడతాయో చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. అన్ని చోట్లా పర్వాలేదనిపించుకుంటూ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న పొన్నియన్ సెల్వన్ సినిమా మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగానూ అంత ఆశాజనకంగా లేకపోవడంతో వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కావాలనే టాలీవుడ్‌లో పొన్నియన్ సెల్వన్ సినిమాని తొక్కేస్తున్నారు అనేది వారి వాదన. అద్భుతమైన సినిమాని టార్గెట్ చేసి ఆడకుండా చేస్తున్నారంటూ విమర్శలకు దిగారు.
We have no issues with Telugu movies winning big in Tamilnadu. But if u wantedly try to bring a tamil movie down – we will hit back for sure !
— Prashanth Rangaswamy (@itisprashanth) September 30, 2022
అయితే కంటెంట్ ఉంటే ఏ భాష సినిమా అయినా ఆడుతుందని ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. వలిమై, కమల్ హాసన్ విక్రమ్ సినిమాలు టాలీవుడ్‌లో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. పొన్నియన్ సెల్వన్ సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి ఇది మరో బాహుబలి అవుతుందంటూ ప్రచారాలు చేశారు. ఆ ప్రచారాలు, ట్రైలర్, టీజర్‌లు వంటివి చూసి తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాకపోతే మన నేటివిటీ కానిది, కథ పరంగా మనకు కాస్త కూడా పరిచయం లేదు కాబట్టే ఈ సినిమాకి ఆశించిన ఫలితం దక్కలేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ట్రోలింగ్‌కి తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియాలో గట్టిగా బదులిస్తున్నారు. ఇప్పుడు ఏంటి మీ సినిమా హిట్ అని ఒప్పుకోవాలా? ఎందుకు ఈ గోల స్టార్ట్ చేశారు. కంటెంట్ ఉన్న సినిమా ఎక్కడైనా ఆడుతుందనే విషయం ఇప్పటికీ మీకు అర్థం కావడం లేదా? అంటూ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.
Leave telugu , we can see even Malayalam many pages saying movie slow and no wow factor…if movie isn’t gd u can’t save it, if movie is gd whatever others do still movie will run..but the fact is apart frm Tamilian (which is obvious bcz of their sentiments) max saying the same
— akashdeb (@urs_akash123) September 30, 2022