హమ్మయ్యా.. ‘కాంతార’ మేకర్స్ కు ఓ విషయంలో పెద్ద రిలాక్సేషన్ దొరికింది. అసలు అంచనాల్లేకుండా రిలీజైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేసింది. వందల కోట్ల వసూళ్లు సాధించింది. సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరినీ అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం ‘కాంతార’ ఫ్యాన్స్ డిస్ట్రబ్ అయ్యారు. ఇంతమంచి సినిమాకు అలా జరగకూడదని అనుకున్నారు. కానీ అదే జరిగింది. ఓటీటీలో సినిమా చూసిన చాలామంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ నిరాశవ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు వారందరినీ హ్యాపీ చేసే ఓ వార్త ఇప్పుడు బయటకొచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అది ఏ సినిమా అయినా సరే క్లైమాక్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే సినిమా అంతా ఎలా ఉన్నా సరే క్లైమాక్స్ బాగుంటే మాత్రం.. మిగతావేవి ప్రేక్షకుడు పట్టించుకోడు. దీనికి నిదర్శనమే ‘కాంతార’. గత రెండు నెలల నుంచి ఎక్కడా విన్నా, చూసినా సరే ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వరహారూపం సాంగ్, అందులో రిషబ్ శెట్టి యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు. అయితే ఈ సాంగ్ ని.. తన పాట నుంచి కాపీ చేశారని కేరళకు చెందిన తైక్కుడం బ్రిడ్స్ అనే మ్యూజిక్ బ్యాండ్ ట్రూప్ కోర్టుకెళ్లింది. వీరికి వేసిన పిల్ ఆధారంగా కోర్టు.. ఈ పాటపై నిషేధం విధించింది. దీంతో నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మిస్.. వరహా రూపం సాంగ్ ని యూట్యూబ్ తో సహా అన్ని ఫ్లాట్ ఫామ్స్ నుంచి డిలీట్ చేసింది.
అయితే నవంబరు 24న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ‘కాంతార’ రిలీజైంది. కానీ సినిమాకే మెయిన్ హైలెట్ గా నిలిచి, క్లైమాక్స్ లో ఆడియెన్స్ కి పూనకాలు తెప్పించిన ‘వరహారూపం’ పాటని వేరే దాంతో రీప్లేస్ చేశారు. దీంతో చాలామంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సినిమాలో పాట తీసేస్తే ఎలా అని అడిగారు. ఇక తాజాగా పిల్ ని పరిశీలించిన కేరళ కోర్టు.. ఎట్టకేలకు వరహారూపం సాంగ్ పై విధించిన బ్యాన్ ఎత్తేసింది. దీంతో మేకర్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లయింది. అలానే ‘కాంతార’ కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ కూడా వేసినట్లు అయింది. దీంతో ఓటీటీలో ‘కాంతార’ ఒరిజినల్ సాంగ్ రీప్లేస్ చేసే అవకాశముంది. మరి ‘వరహరూపం’ సాంగ్ ఫ్యాన్స్ మీలో ఎంతమంది ఉన్నారు. బ్యాన్ ఎత్తేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.