చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన కీర్తీ సురేశ్.. సినిమా ఇండస్ట్రీలో మహానటిగా ఎదిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ, ఇటీవల కీర్తీ సురేశ్ కెరీర్ లో వరుస ఫ్లాపులతో ఎన్నో ఒడిదొడుకులు చూసింది. ఇటీవల అరుణ్ మాతేశ్వరన్ సాని కదియం(తెలుగులో చిన్ని) అనే సినిమా, మహేశ్ సరసన సర్కారు వారి పాట సినిమాలతో కీర్తీ సురేశ్ డబుల్ హిట్స్ కొట్టింది. ఈ రెండు సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ కావడంపై సోషల్ మీడియాలో వేదికగా కీర్తీ సురేశ్ స్పందించింది. ఈ రెండు సినిమాల క్రూ, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.
‘యాక్టర్ల జీవితం ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంటుంది. మా జీవితాల్లో ఎదురయ్యే సంఘటనలే మా గమ్యాన్ని నిర్దేశిస్తాయి. గత కొన్నేళ్లుగా నా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. నాలోని అత్యుత్తమ నటిని ఈ ప్రపంచానికి కంటిన్యూగా చూపిస్తూనే ఉండాలని ఆ ఘటనల వల్లే తెలుసుకున్నాను. చిన్ని, సర్కారు వారి పాట సినిమాలను మీరు ఆదరించిన తీరు, నాపై మీరు చూపించిన ప్రేమ నన్ను ఎంతగానో ఆనందింపజేశాయి’.
‘సాని కదియం బృందం మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను చిన్నిగా ఊహించుకుని నేను ఇంతవరకు చేయని ఒక పాత్ర నాకు ఇచ్చిన నిర్మాత, డైరెక్టర్ మాతేశ్వరన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. సంగయ్యగా నా కోస్టార్ సెల్వరాఘవన్ గారిని తప్ప మరెవరినీ ఆ పాత్రలో ఊహించుకోలేం. మీరు తప్ప సంగయ్య పాత్రకు మెరవ్వరూ న్యాయం చేయలేరు. యామినీ డీవోపీగా ఈ సినిమా మొత్తాన్ని నీ భుజాలపై మోశావు. నా కెరీర్లో సాని కదియం లాంటి ఇంత మంచి సినిమా అందించిన చిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది.
అటు సర్కారు వారి పాట సినిమా బృందం, నిర్మాతలు, డైరెక్టర్ పరశురామ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డీవోపీ అందరికీ ధన్యవాదాలు. సర్కారు వారి పాట సినిమాని ఇంత బిగ్గెస్ట్ హిట్ అయ్యేందుకు మీరంతా ఎంతో కష్టపడ్డారు. సినిమా అంతటా నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచిన నమ్రతా మేడక్ కు ధన్యవాదాలు. మహేశ్ బాబు సార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. సర్కారు వారి పాట సినిమా కాస్ట్, క్రూ అందరికీ ధన్యవాదాలు.
నా అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదులు చెబుతున్నాను. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది కేవలం మీ వల్ల మాత్రమే. నా ప్రయాణంలో ఎలాంటి అడ్డంకి వచ్చినా.. నాకు సరైన మార్గాన్ని చూపేది మీ సపోర్ట్ మాత్రమే. నా జర్నీలో భాగమైన ప్రతి ఒక్క డైరెక్టర్, నిర్మాతకు కృతజ్ఞతలు. సరిహద్దులు పెట్టుకోకుండా నన్ను నేను మెరుగుపరుచుకుంటూ.. ఫలితం ఏదైనా నా ప్రయాణాన్ని మాత్రం ఆపను’ అంటూ కీర్తీ సురేశ్ లేఖలో రాసుకొచ్చింది. కీర్తీ సురేశ్ లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.