బాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులు కరోనా బారినపడటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఇటీవల ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇంటిలో ఇచ్చిన విందుకు వెళ్లిన వారికి కరోనా కరోనా వస్తుందన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై కరణ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన ఇల్లు ఏమీ కరోనా హాట్‌స్పాట్ కాదని.. తాను ఇచ్చింది కేవలం విందు మాత్రమేనన్నారు. అది పార్టీ కాదని తనపై వస్తోన్న విమర్శలను తోసిపుచ్చారు.
“నాతో సహా నా కుటుంబం, ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. నేను రెండుసార్లు పరీక్ష చేయించుకున్నాను. అందరికీ నెగెటివ్ వచ్చింది. కేవలం ఎనిమిది మంది వ్యక్తులు ఆత్మీయంగా కలుసుకుంటే అది పార్టీ కాదు. కొవిడ్ నిబంధనలను కఠినంగా పాటించే నా ఇల్లు.. కచ్చితంగా కొవిడ్ హాట్‌స్పాట్ కాదు” అని కరణ్ ఇన్‌స్టాగ్రాంలో ద్వారా తెలియజేశారు. కరోనా మహమ్మారి విషయంలో జాగ్రత్తగా ఉండటం మన బాధ్యతని రిపోర్టింగ్ చేసే సమయంలో కొందరు మీడియా సిబ్బంది సంయమనం పాటించాలని కోరుతున్నాను అంటూ కరణ్ జోహార్ తెలిపారు.
ఈ నెల 8వ తేదీన కరీనా కపూర్, అమృత అరోరాతో పాటు కొంతమంది బీటౌన్ ప్రముఖులు కరణ్‌జోహార్ ఇంట్లో డిన్నర్‌కి వెళ్లారు. ఆ తర్వాతే కరీనా, అమృత కరోనా బారినపడ్డారు. వీరితో పాటు సీమా ఖాన్, మహీప్ కపూర్ లకు కూడా కొవిడ్ సోకింది. ఈ పార్టీకి హాజరైన వారిలో పలువురికి వైరస్ సోకినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. తనపై వస్తున్న ఆరోపణలపై కరణ్ జోహర్ సోషల్ మీడియా వేదికగా ఖండించారు. కరణ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
“My Home Not A Hotspot, Dinner Was Not A Party”: #KaranJohar Tests Negative#COVID19
Read more: https://t.co/kOeRQTlahR pic.twitter.com/wGOSIowuHp— NDTV (@ndtv) December 15, 2021