కరణ్ జోహార్.. పాన్ ఇండియా లెవల్లో ఈయనకు మంచి పేరుంది. నిర్మాత, వ్యాఖ్యాతగా ఈయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. బాలీవుడ్‌లో బడా హీరోలు, బడా హీరోయిన్లు ఈయనంటే పడిచస్తారు. ఇటీవలే రౌడీ హీరో విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాథ్ తీసిన లైగర్ సినిమాకి కరణ్ జోహార్ కూడా ఒక నిర్మాత. బీ టౌన్‌లో కరణ్ జోహార్ కాంపౌండ్‌లో చాలా మంది సెలబ్రిటీలే ఉన్నారంటారు. ఈయనకు సినిమాలు తీయడమే కాకుండా.. టాక్ షో అంటే కూడా బాగా ఇష్టం. కాఫీ విత్ కరణ్ అంటూ ఒక షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఆ షో ఇప్పటికే విజయవంతంగా 7 సీజన్లు పూర్తి చేసుకుంది. ఏడో సీజన్ ఇటీవలే పూర్తైంది. అయితే ఈ సీజన్ ముగిసిన తర్వాత నుంచి కరణ్ జోహార్‌పై నెగెటివ్ కామెంట్లు ఎక్కవయ్యాయి.
ఎందుకంటే కాఫీ విత్ కరణ్ షోకి ఎంతో గొప్ప స్టార్ హోరీలు, హీరోయిన్లు వస్తుంటారు. ఈసారి కూడా అలాగే చాలా మందే స్టార్‌లు వచ్చాలు. వారితో కరణ్ జోహార్ ఎక్కువగా సె*క్స్ లైఫ్ గురించే ప్రశ్నలు అడిగాడు. ఆ షోలో పాల్గొన్న విజయ్ దేవరకొండని నువ్వు చివరిసారిగా ఎప్పుడు శృంగారం చేశావు అని అడిగాడు. అందుకు మనోడు ఎలాగో తప్పించుకున్నాడు. తర్వాత కరీనా కపూర్- అమీర్ ఖాన్ షోకి రాగా.. పిల్లలు పుట్టాక సె*క్స్ లైఫ్ క్వాలిటీగా ఉంటుంది అనేది నిజమా? భ్రమా? అని అడిగాడు. అందుకు బెబో నీకు తెలియదా అంటూ కౌంటర్ వేసింది. ఇంక సోనమ్ కపూర్- అర్జున్ కపూర్లు రాగా.. నీ బ్రదర్ నీ ఫ్రెండ్స్ అందరితో బెడ్ షేర్ చేసుకున్నాడు అంట నిజమేనా అని అడిగాడు. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ప్రశ్నలు ఉన్నాయి. ఈ షో మీద, ఈ ప్రశ్నల మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే ఈ విమర్శల మీద కరణ్ జోహార్ తాజాగా స్పందించాడు. “కాఫీ విత్ కరణ్ షో చేయడం అంటే ఇష్టం. అందుకే నేను ఆ షో చేస్తున్నాను. నా షో విషయంలో, నేను అలియా భట్ గురించి మాట్లాడే విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. కాఫీ విత్ కరణ్ షో చేయడం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకే నేను ఆ షో చేస్తున్నాను. అది టాక్ షో.. అందులో చాలా ప్రశ్నలు ఉంటాయి. నేను సె*క్స్ లైఫ్ గురించి ఎక్కువగా అడుగుతున్నాను అంటే.. ఒకవేళ అవలివారి శృంగార జీవితం గురించి తెలుసుకోవాలని నాకు ఆసక్తి ఉందేమో. నేను నా షోలో అందుకే అలాంటి ప్రశ్నలే ఎక్కువ వేశానేమో. నిజానికి నేను అన్ని రకాల ప్రశ్నలు వేశాను. కానీ, సె*క్స్ కు సంబంధించినవి మాత్రమే ఎత్తి చూపారు. నేను అలియా భట్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను అంటే.. ఆమె చూస్తే నాకు గర్వంగా ఉండి ఉండచ్చు అందుకే అలా మాట్లాడుతున్నానేమో” అంటూ కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.