‘కాంతార’ మూవీ మీలో ఎంతమంది చూశారు? అంటే చాలామంది చూశామని అంటారు. కన్నడ సంప్రదాయ, ఆచారాలని బేస్ చేసుకుని తీసిన ఈ సినిమా.. కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు నచ్చేసింది. ఇక కన్నడలో విడుదలైన కొన్నిరోజుల్లోనే మిగతా భాషల్లోనూ డబ్ అయింది. ప్రస్తుతం తెలుగులోనూ విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఇక హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి మైండ్ బ్లోయింగ్ ఫెర్ఫామెన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. కానీ ఓ విషయం మాత్రం తనకు నచ్చట్లేదని అతడు బయటపెట్టాడు.
ఇక విషయానికొస్తే.. ‘కాంతార’ అంటే సంస్కృతంలో అడవి అని అర్ధం. టైటిల్ కి తగ్గట్లే సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మట్టి వాసన గుబాళిస్తుంది. ఇక అజనీష్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. విజువల్స్ అయితే మనల్ని ‘కాంతార’ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయాయి. సినిమాలో కొన్ని కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నాయి. కానీ చివరి 15 నిమిషాల క్లైమాక్స్ లో హీరో రిషబ్ శెట్టి విశ్వరూపం దెబ్బకు మిగతా సినిమా గురించి మర్చిపోతారు. ఓ ట్రాన్స్ తో థియేటర్ బయటకు వస్తారు.
అయితే ఈ మూవీలో కోలం వేసిన వ్యక్తి.. ‘ఓ’ అని గట్టిగా అరుస్తుంటారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సౌండ్ గురించి చాలామంది మెచ్చుకుంటున్నారు. అదే టైమ్ లో.. ఇదే శబ్దాన్ని ఇమిటేషన్ లాంటివి చేస్తూ మీమ్స్ తయారు చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన హీరో రిషబ్ శెట్టి… ”కాంతార’ చూసిన వాళ్లందరూ కూడా సినిమాలో చేసిన అరుపుని ఇమిటేట్ చేయొద్దు. అవి సంప్రదాయ నమ్మకాలు, సెంటిమెంట్స్ కి సంబంధించినవి. మీరు చేసే చర్యల వల్ల సెంటిమెంట్స్ దెబ్బతినొచ్చు’ అని రిక్వెస్ట్ చేశాడు. మరి రిషబ్ చెప్పిన విషయమై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.