కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో దర్శన్ ఒకరు. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నాడీ ఈ హీరో. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకుని ఛాలెంజింగ్ స్టార్ గా దర్శన్ పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు అర్ధ శతకంకి పైగా చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. తాజాగా అతడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. హిందువులు పవిత్రంగా పూజించే అదృష్ట దేవతపై దర్శన్ వివాదస్పద కామెంట్స్ చేశాడు. దీంతో హిందూ సంఘాలు దర్శన్ పై ఫైర్ అవుతున్నాయి. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హిందూ సంఘాలు హెచ్చరించాయి. ఇంతకి ఇంటర్వ్యూలో దర్శన ఏం కామెంట్స్ చేశాడు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవల కొంతకాలం నుంచి కన్నడ స్టార్ హీరో దర్శన్ సినిమాల్లో కంటే వివాదాలతో వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు. గతంలో ఓ నిర్మాతతో ఇష్యూ వార్తలో నిలిచాడు. తాజాగా ఆయన మరో కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లో నిలిచాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శన్ పాల్గొన్నారు. తన సినిమాలకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. అలానే తన సినీ కెరీర్ గురించి అనేక విషయాలను చెప్పుకున్నాడు. ఈక్రమంలో అదృష్ట దేవత తలుపు తట్టదని తలుపు తట్టినప్పుడు మనం అందుకోవాలని అని యాంకర్ అంటారు. అయితే యాంకర్ వ్యాఖ్యలకు దర్శన్.. తనదైన రీతిలో అదృష్ణ లక్ష్మి గురించి చెప్పాడు. ఆయన మాట్లాడూతు..” అదృష్ట దేవత తలుపు తట్టదు. ఒక వేళ తలుపు తట్టినప్పుడు మనం ఆమెను గదిలోకి లాక్కెళ్లి న*గ్నంగా చేయాలి. అప్పుడు ఆమె ఇంట్లోనే ఉండిపోతుంది. ఒకవేళ దుస్తులు ఇస్తే తిరిగి ఆమె వెళ్లిపోతుంది” అని అన్నారు.
దర్శన చేసిన ఈ వ్యాఖ్యలో ప్రస్తుతం కాంట్రవర్సియల్ గా మారాయి. సాధారణంగా అదృష్ట దేవత అంటే లక్ష్మిదేవిగా హిందువులు భావిస్తారు. లక్ష్మిదేవి అంటే సాక్ష్యాతు శ్రీ మహా విష్ణువు సతీమణి. సిరిసంపదలు ఇచ్చే దేవతగా లక్ష్మిదేవికి హిందువులు పూజలు చేస్తుంటారు. అలాంటి దైవాన్ని పట్టుకుని గదిలోకి తీసుకెళ్లాలి, దుస్తుల్ని విప్పేయాలంటావా? అంటూ హిందూ సంఘాలు హీరో దర్శన్ పై నిప్పులు చెరుగుతున్నారు. అంతే కాకుండా దర్శన్ వెంటనే క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఇప్పటికి వరకు ఈ వివాదం దర్శన్ రియాక్ట్ కాలేదు. మరి.. తనపై వస్తున్న వార్తలపై ఎలా ప్రతిస్పందిస్తాడో చూడాలి.