విశ్వనటుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకొని, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే విడుదలైన 5 రోజుల్లోనే విక్రమ్ 200కోట్లు వసూల్ చేసి కోలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. అలాగే విడుదలైన అన్నిచోట్లా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి మంచి లాభాలను వసూల్ చేస్తోంది.
ఈ క్రమంలో చాలా ఏళ్ళ తర్వాత కమల్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీంతో విక్రమ్ టీంతో కలిసి కమల్ సక్సెస్ ని ఆస్వాదిస్తున్నాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని లాభాలబాట పట్టిన నేపథ్యంలో కమల్.. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి లగ్జరీ కారు(లెక్సస్ – కోటిన్నర విలువ ఉంటుందని అంచనా)ను గిఫ్టుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విక్రమ్ మూవీ సక్సెస్ ని మరింత ఎంజాయ్ చేస్తూ.. ఈ సినిమాలో స్పెషల్ రోల్ ‘రోలెక్స్’గా నటించిన హీరో సూర్యకు కూడా ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు కమల్.విక్రమ్ లో సూర్య పోషించిన రోలెక్స్ పాత్రకుగానూ.. ఖరీదైన రోలెక్స్ వాచ్ బహుమతిగా ఇచ్చాడు. ఆ వాచ్ ధర దాదాపు రూ. 23 – 28 లక్షల పైనే ఉంటుందని సమాచారం. కమల్ గిఫ్ట్ కి సూర్య థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం కమల్ సూర్యకు, డైరెక్టర్ లోకేష్ కి గిఫ్టులు అందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో స్టార్స్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్. మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ప్రస్తుతం విక్రమ్ 105 కోట్ల షేర్ దాటి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మరి విక్రమ్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
A moment like this makes life beautiful! Thank you Anna for your #Rolex! @ikamalhaasan pic.twitter.com/uAfAM8bVkM
— Suriya Sivakumar (@Suriya_offl) June 8, 2022