ఆ హీరోయిన్ స్టార్ డైరెక్టర్ కూతురు. సౌత్ లోని కన్నడ తప్పించి అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఆమె కట్టిన చీర ఖరీదు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
నువ్వు ఏ డ్రస్ వేసుకున్నా మహా అయితే నీ ఫ్రెండ్స్ తప్పించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే ఓ స్టార్ హీరో లేదా హీరోయిన్ ఏదైనా కొత్త డ్రస్ వేసుకోవడం, ఫొటోలకు పోజులివ్వడం లేటు.. అది వైరల్ అయిపోతుంది. దాని కాస్ట్ ఎంతో తెలుసుకునేందుకు నెటిజన్స్ తెగ సెర్చ్ చేసేస్తారు. రీసెంట్ గా అలా పవన్ కల్యాణ్ హుడీ, చిరంజీవి వాచీ, ఎన్టీఆర్ షూస్ రేటు ఇన్ని లక్షలు, అన్ని లక్షలు తెగ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి ఓ స్టార్ హీరోయిన్ కూడా చేరింది. ఏకంగా లక్ష రూపాయల విలువైన చీరతో ఫొటోలకు పోజిలిచ్చింది. తాజాగా అవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ లో ఎంతోమంది బ్యూటీస్ వస్తుంటారు పోతుంటారు. కొందరు మాత్రమే నిలబడగలుగుతారు. ఒకవేళ ఇక్కడ తక్కువే సినిమాలే చేసినప్పటికీ క్రేజ్ మాత్రం బాగానే తెచ్చుకుంటారు. అలాంటి వారిలో హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ కచ్చితంగా ఉంటుంది. మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు అయిన ఈమె.. చైల్డ్ ఆర్టిస్ట్ కొన్ని సినిమాలు చేసింది. హీరోయిన్ గా అఖిల్ ‘హలో’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇది మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తన క్యూట్, బబ్లీ ఫేస్ తో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు తగ్గించేసింది కానీ.. తమిళ, మలయాళ సినిమాలతో ఓటీటీలో ఎంటర్ టైన్ చేస్తూ టాలీవుడ్ ఆడియెన్స్ కి దగ్గరగానే ఉంది.
ఇక సినిమాలు మాత్రమే కాదు జ్యూవెలరీ, చీరల యాడ్స్ లోనూ యాక్ట్ చేస్తున్న కల్యాణి.. సోషల్ మీడియాలో ఆయా ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా అలా బ్యూటీఫుల్ చీరతో పిక్స్ దిగి పోస్ట్ చేసింది. అయితే ఆ చీర కాస్ట్ దాదాపు లక్ష రూపాయలని తెలుస్తోంది. ఇది తెలిసి ఫ్యాన్స్, నెటిజన్స్ షాకవుతున్నారు. అంత ఖరీదైన ఆ చీరలో ఏముందబ్బా అని తెగ ఆరా తీస్తున్నారు. మరి హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్.. లక్ష రూపాయల చీర కట్టడంపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.