నందమూరి హీరోలలో ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వస్తున్నారు కళ్యాణ్ రామ్. పటాస్ లాంటి బిగ్ హిట్ తర్వాత వరుస ప్లాప్ లతో తడబడిన కళ్యాణ్ రామ్.. గతేడాది బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమా విజయంతో తదుపరి సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. బింబిసారలో డబుల్ రోల్ చేసిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు అమిగోస్ సినిమాలో ట్రిపుల్ రోల్ చేశారు. ప్రస్తుతం ఈ అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కి రెడీ అయ్యింది. కాగా.. సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కళ్యాణ్ రామ్.. సినిమాతో పాటు తన పర్సనల్ లైఫ్ విషయాలు కూడా షేర్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ తన భార్య గురించి గొప్పగా మాట్లాడారు. మొదటిసారి చేతిపై భార్య స్వాతి పేరు పచ్చబొట్టు వేయించుకోవడం వెనకున్న కథను రివీల్ చేశారు. మీ భార్య స్వాతి పేరు చేతిపై వేయించుకున్నారు.. ఆ టాటూ వెనుక కథేంటి? అని అడిగిన ప్రశ్నకు కళ్యాణ్ రామ్ సమాధానమిస్తూ.. “2007-8 మధ్య నేను అనారోగ్యానికి గురయ్యాను. ఆరోగ్యం అస్సలు బాలేదు. అప్పుడు అందరి భర్త పట్ల కేర్ తీసుకుంటారు.. కొందరు నర్సులను పెట్టి చూసుకోమని చెప్పేస్తారు. కానీ, నా విషయానికొస్తే.. ఆ నర్సులను కూడా వద్దని, తానే దగ్గరుండి చూసుకుంది.
స్వాతికి నా గురించి అంతా తెలుసు. అమ్మ తన బిడ్డను ఎలా చూసుకుంటుందో.. తను నన్ను అలా చూసుకుంటుంది. తన కేరింగ్ నా మనసుకు దగ్గరైంది. నాకు ఇంజక్షన్స్ అంటే చాలా భయం. అయితే.. మా 10వ మ్యారేజ్ డే రోజున నీకేం కావాలో చెప్పు.. ఏదైనా ఇస్తాను అని అడిగాను. కానీ, నా భార్య తనకేం వద్దని.. మీరు, పిల్లలు ఉన్నారు చాలు అంది. అప్పుడు నాకు తన పేరు టాటూ వేయించుకోవాలని అనిపించింది. నాకు సూదులంటే భయం.. అయినా మీద ఉన్న ఇష్టంతో ఈ టాటూ వేయించుకున్నా.. తను లేకపోతే నేను లేను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.