సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సృష్టించిన ప్రైవేట్ ఆల్బాబ్ ‘కచ్చా బాదాం’ . కచ్చా బాదాం సాంగ్ కి సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం రీల్స్ చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన భూబన్ కచ్చా బాదమ్ గ్రామాల్లో పల్లీలు అమ్ముకునే సమయంలో పాడిన పాట కచ్చాబాదం. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భూబన్ ఒక్కసారే పాపులర్ అయ్యాడు.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తమ టాలెంట్ తో రాత్రికి రాత్రే స్టార్స్ అవుతున్నారు. సోషల్ మీడియాలో తమ పర్ఫామెన్స్ తో కోట్ల మంది అభిమానం పొందుతూ ఎంతో పాపులారిటీ సంపాదిస్తున్నారు. ఇలా ఒకే ఒక్క పాటతో రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు కచ్చా బాదం సింగర్ భూబన్ బద్యాకర్. చిన్న గ్రామంలో సైకిల్ పై పల్లీలు అమ్ముకుంటూ అందరినీ ఆకర్షించేందుకు పాడిన కచ్చా బాదం సాంగ్ ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త కొద్దిరోజుల్లోనే తెగ వైరల్ అయ్యింది. ఈ పాటకు ఏ రేంజ్ లో వ్యూస్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల భూబన్ బద్యాకర్ ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి సమయంలో సీరియల్ రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సృష్టించిన ప్రైవేట్ ఆల్బాబ్ ‘కచ్చా బాదం’. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పులు వేశారు. కచ్చా బాదాం సాంగ్ కి సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం రీల్స్ చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. అయితే ఇంత పాపులారిటీ సంపాదించిన కచ్చా బాదం సాంగ్ ని ఏ ప్రొఫెషనల్ సింగర్ పాడారా అని అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఈ పాట గ్రామాల్లో పల్లీలు అమ్ముకునే ఓ సాధారణ వ్యక్తి పాడిన పాట. పశ్చిమ బెంగాల్ కు చెందిన భూబన్ కచ్చా బాదమ్ పాట పాడుతూ పల్లీలు అమ్ముకునేవాడు. ఓ వ్యక్తి ఆ పాటను రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అనూహ్యమైన స్పందన వచ్చింది. ఎంత తర్వగా ఎదిగాడో.. అదే రీతిలో పతనం అయ్యాడు. ఇటీవల భూబన్ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వచ్చాయి.
కచ్చా బాదం సింగర్ భూబన్ బద్యాకర్ ఆర్థిక కష్టాలు పడుతున్న సమయంలో.. అదృష్టం కలిసి వచ్చింది. త్వరలో ఈ సింగర్ బుల్లితెరపై సందడి చేయబోతున్నాడు. ఓ బెంగాలీ సీరియల్ లో తండ్రి పాత్రకు ఓకే చెప్పాడు భూబన్ బద్యాకర్. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యిందట. ఈ పాత్రలో నటించినందుకు గాను భూబన్ బద్యాకర్ కి రూ.40 వేలు రెమ్యూనరేషర్ ఇచ్చినట్లు సమాచారం. భవిష్యత్ లో తనకు ఛాన్సు వస్తే మరిన్ని పాత్రల్లో నటించేందుకు సిద్దంగా ఉన్నానని భూబన్ బద్యాకర్ అంటున్నాడు. తన పాటలతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని.. కానీ కాలం కలిసి రాక తాను ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు.
భూబన్ బద్యాకర్ పాడిన కచ్చా బాదం పాటను ప్రైవేట్ ఆల్బాం చేయగా అది కాస్తా సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించింది. దాంతో భూబన్ బద్యాకర్ సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యాడు. తర్వాత పలు పాటలు, ప్రదర్శనలతో బాగా డబ్బు కూడా సంపాదించాడు. ఈ క్రమంలోనే భూబన్ బద్యాకర్ ఓ కారు కొని డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో ప్రమాదం జరిగి ఆస్పత్రి పాలయ్యాడు. డబ్బు సంపాదిస్తున్న సమయంలో బంధువుల, మిత్రులు అతని వద్ద అప్పుగా డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వలేదు.. వారి వద్ద నుంచి వసూళ్లు కూడా చేయలేకపోయాడు భూబన్ బద్యాకర్. దీనికి తోడు అతనికి చదువు రాని కారణంగా ఓ కంపెనీ మూడు లక్షలు ఇచ్చి అతనిచే పత్రాలపై సంతకాలు తీసుకుంది. దాని కారణంగా అతడు ఏ పాట పాడి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసినా కాపీరైట్ ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి.