K Rajan: తమిళ సినిమాలపై అవగాహన ఉన్న వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు కే రాజన్. ప్రముఖ నిర్మాత అయిన ఈయన తమిళ నటులపై, డైరెక్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరుచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా, రాజన్ ప్రముఖ తమిళ నటుడు సెండ్రాయన్‌ను తీవ్రంగా అవమానించారు. సినిమా ట్రైలర్ లాంచ్ జరుగుతున్న స్టేజిపై నటుడితో దురుసుగా ప్రవర్తించారు. సినిమాలు మానేయమని, వేరే పని చూపిస్తానని అంటూ అవమానకరంగా మాట్లాడారు. తాజాగా, ‘లోకల్ సరకు’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. డైరెక్టర్ ఎస్పీ రాజ్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫంక్షన్‌కు కే రాజన్ అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కే రాజన్ మాట్లాడుతూ.. ‘లోకల్ సరకు’ నిర్మాతకు ఇకపై సినిమాలు తీయోద్దని సలహా ఇచ్చారు. ‘‘తమిళ్ ఇండస్ట్రీలో నిర్మాతలకు మర్యాద లేదు. ఒక 5-10 సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేసి డబ్బులు కూడబెట్టుకో. తర్వాత సినిమాలు చేయి. సినిమాలు చేయటం ఓ పెద్ద టార్చర్’’ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో నటుడు సెండ్రాయన్ కల్పించుకుని ‘‘ మీరు సినిమాలు చేస్తేనే కదా మాకు పని ఉండేది’’ అని అన్నారు. దీంతో రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ నువ్వు సినిమాలు మానేయ్.. నీకు వేరే పని ఇప్పిస్తాను. నీకెలా పని లేకుండా చేస్తాను.
పో.. పోయ్ కూర్చో.. నువ్వు నాకంటే ఎక్కువ అనుభవం ఉన్నవాడివా? మీకు పని కల్పించటానికి మా జీవితాలను నాశనం చేసుకుంటున్నాము. నేను ఇప్పటివరకు 9 సినిమాలు చేశాను. పలుసార్లు అవమానాలకు గురయ్యాను’’ అని అన్నారు. ఆ తర్వాత సెండ్రాయన్ మీడియాతో మాట్లాడుతూ.. కే రాజన్ తనను అన్న మాటలపై ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్‌పై గౌరవం ఉందని, కోపం రాలేదని అన్నారు. ప్రస్తుతం కే రాజన్, సెండ్రాయన్‌ను అవమానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి: Chandra Hass: ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడండి!