శాండల్‌వుడ్‌లో ఇప్పుడిప్పుడే డ్యాన్సర్‌గా నిలదొక్కుకుంటున్న ఓ జూనియర్ డ్యాన్స్‌ర్ కన్నుమూసింది. వాంతులు, విరోచనాల కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు చనిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన సంజనా అనే 15 ఏళ్ల బాలిక టెన్త్ క్లాస్ చదువుతోంది. ఓ వైపు చదువుతూనే మరో వైపు బట్టల షాపులో పనిచేస్తోంది. అంతేకాదు! పలు సినిమాల్లో జూనియర్ డ్యాన్సర్‌గా కూడా పనిచేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె కొద్దిరోజుల క్రితం వాంతులు, విరేచనాలకు గురైంది. దీంతో ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడి వైద్యులు ఆమెకు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స చేశారు. అయినప్పటికి ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. చికిత్స పొందుతూ సంజన చనిపోయింది. అయితే, ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని సంజన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీనిపై బాగలగుంటె పోలీసులను ఆశ్రయించారు. ఆసుపత్రిపై కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, వాంతులు, విరేచనాల కారణంగా జూనియర్ డ్యాన్సర్ చనిపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.