సినీనటులు రాజశేఖర్, జీవిత దంపతులు తమను మోసం చేశారంటూ జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. సినిమా నిర్మాణం కోసం తీసుకున్న రూ.26 కోట్లు ఇవ్వటం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరి కోర్టు జీవితా రాజశేఖర్‌కి షాకిచ్చింది. ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో తమకు న్యాయం చేయాలంటూ జోస్టర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నగరి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తమపై వచ్చిన చెక్ బౌన్స్ కేసు ఆరోపణపై నటి జీవితా రాజశేఖర్ స్పందించారు.
మీడియా ముందు నటి జీవితా మాట్లాడుతూ..”మేము ఎలాంటి తప్పు చేయలేదు. కోర్టు తీర్పు తర్వాత అన్ని వివరాలు చెబుతాం. మాపై ఆరోపణలు చేసిన వారు చాలా తప్పులు చేశారు. వారు మాపై చేసిన ఆరోపణలు అన్ని అసత్యం. నేను ఎంత మంచి పని చేసిన కొంత మంది నచ్చదు. జీవితంలో మంచి చెడు స్నేహాలు ఉంటాయి. ఎవరు మంచి, ఎవరు చెడు అని చూసి.. జడ్డీ చేయలేం. ఆ క్యాపాసిటి అయితే నాకు లేదు. నేను అందరిని జన్యూన్ గా నమ్ముతాను. వాళ్లు ఏ ఆరోపణ చేసిన వాటిని ఫ్రూ చేసుకునే అవసరం వాళ్లకుంది. మేము వెళ్లి మా వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది.
నేనైయితే ఎటూ పారిపోలేదు. మీ కళ్లముందే తిరుగుతున్నాను. ఇక్కడ నా రిక్వస్ట్ ఒక్కటే ఇష్యు ఏంటి అని తెలియకుండా.. థంబ్ నైల్ పెట్టేయండి. చాలా ఇబ్బంది. మా ఎన్నికల సమయంలో ప్రకాశ్ రాజ్ కి చాలా మంది సపోర్టు చేశారు. కానీ నేను మాత్రమే హైలెట్ అయ్యాను. నేను రాజశేఖర్ ఓపెన్ గా మాట్లాడుతాం. నిజంగా దుర్మార్గులం, దృష్టులం అయితే 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఎలా ఉండగలుగుతాము. పోలీసులు, కోర్టులు ఎందుకు ఊరుకుంటాయి. నాకు చాలా బాధగా ఉంది. నేను అందుబాటులో ఉన్నప్పటికి మీడియా వాళ్లు నా వివరణ కూడా తీసుకోవాల్సింది. కోర్టు ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు ఏమి మాట్లాడలేను” అని తెలిపారు. మరి.. జీవితా రాజశేఖర్ ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.