హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటడు జగపతి బాబు. రియల్ జీవితంలో విభిన్నమైన ఆలోచనలతో ముందుకెళ్తాడు. తానో పెద్ద స్టార్‌ను అన్న గర్వం ఏ కోశాన లేకుండా.. సింపుల్‌గా అందరితో కలిసిపోతారు. అలాంటి జగపతి బాబు నిజ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆ వివరాలు..
టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు జగపతి బాబు. ఒకప్పుడు ఈయన నటించిన మావిడాకులు, శుభలగ్నం వంటి సినిమాలు ఎంత భారీ విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోగా వరుస ఫెయిల్యూర్స్ చవి చూసిన జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు. హీరోగా చేసినప్పటి కంటే.. ప్రస్తుతం ఆయన కెరీర్ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. సినిమాల సంగతి పక్కకు పెడితే.. రియల్ లైఫ్‌లో ముక్కుసూటి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నాడు జగపతి బాబు. రియల్ లైఫ్‌లో చాలా సింపుల్‌గా ఉంటారు. డబ్బు మీద వ్యామోహం ఉండదు.. కులమతాలకతీతంగా ప్రవర్తిస్తారు అనే పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన సుమన్‌టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిలో పలు అంశాలపై జగపతిబాబు వెల్లిబుచ్చిన అభిప్రాయాలు ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉన్నాయి.
ఈ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్ గురించి.. జీవితంలో ఎదుర్కొన్న క్లిష్ట సమస్యలగురించి.. హీరోయిన్స్‌తో తన రిలేషన్ వంటి వాటి గురించి ఒపెన్‌గా చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, తన కుమార్తె వివాహం సందర్భంగా ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చారు జగపతి బాబు. తనకు సినిమాలు తప్ప మరొకటి తెలియదని.. అందుకే తనకు పెద్దగా గుర్తింపు రాలేదని.. తాను ఈజీగా దొరుకుతాను కాబట్టి.. తన మీద చులకన భావం ఉంటుంది.. అది సహజం అన్నారు జగపతి బాబు.
‘‘అడగందే అమ్మయినా పెట్టదు. ఇండస్ట్రీలో కూడా అడగాలి.. కానీ అడుకున్నట్లు ఉండకూడదు. నాకు అలా చేయడం రాదు. ఆ లోపం నాలోనే ఉంది. దాంతో మనల్ని పక్కకు నెట్టెస్తారు. నేను అడగను కాబట్టి.. చులకన చేస్తారు. ఆ జగపతి బాబే కదా.. వస్తాడు, చేస్తాడు. డబ్బుల కోసం కాదు అనే చులకన భావం ఉంటుంది. దాన్ని కొందరు టెకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. గతంలో ఓ సారి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఏడు రోజుల పాటు షూటింగ్‌లో నాకు కనీసం తిండి కూడా పెట్టలేదు. అడిగితే పెట్టేవారు లేదంటే లేదు. కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా వేయలేదు. అందుకే వాటన్నింటిని భరించాను. ప్రతిదీ నాకు ఓ అనుభవమే. జీవితంలో ముందే కష్టాలను చూస్తే ఆ తర్వాత మిగతా జీవితం ఈజీగా అయిపోతుంది అనుకున్నాను. అందుకే భరించాను. కానీ ఆ రోజు లైట్ భాయ్ వచ్చి నా కాళ్ల దగ్గర కూర్చొని ఏడ్చాడు’’ అని చెప్పుకొచ్చాడు.
పెద్దమ్మాయి వివాహ సమయంలో క్యాస్టిజం వల్ల తాము ఎదర్కొన్న పరిస్థితుల గురించి కూడా చెప్పుకొచ్చాడు జగపతిబాబు. కులం అనేది ఒకే కానీ.. పిచ్చి ఉండటం మంచిది కాదు అన్నారు. జగపతి బాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి జగ్గుభాయ్ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.