ఈ మధ్యకాలంలో మనిషి జీవించడం అనేది సవాల్ అయిపోయింది. ఎవరు ఎప్పుడు ఎలా పోతారో తెలియకుండానే జీవితాలు ముగిసిపోతున్నాయి. నిన్నటివరకు ఓకే అనుకున్న జీవితం.. ఏ క్షణంలో తలక్రిందులు అవుతుందో చెప్పలేం. అంతులేని కష్టాలు, బాధలు, వ్యాధుల మధ్య జీవితమే కష్టమైపోతుంది. ఇందుకు సామాన్యులే కాదు, సెలబ్రెటీలు కూడా అతీతం ఏమి కాదు. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ చాలా మంది మంచి నటులను కోల్పోయింది. తాజాగా తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి విషాదమే నెలకొంది.
మిమిక్రీ ఆర్టిస్ట్ గా, జబర్దస్త్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన కమెడియన్ మూర్తి ఈ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు అరుణ్ స్వయంగా ధృవీకరించారు. జబర్దస్త్ కమెడియన్ మిమిక్రీ మూర్తి గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ ఒక్కటే కాకుండా ఎన్నో వేదికలపై అనేక ప్రదర్శనలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మూర్తి. అయితే.. మూర్తి కొన్నేళ్లుగా ‘ప్యాంక్రియాస్’ క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ మహమ్మారి నుండి బయట పడటానికి ఆయన చాలానే ప్రయత్నాలు చేశారు. కానీ.. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించడం, రోజువారీగా వాడే మెడిసన్ కూడా సైడ్ ఎఫెక్ట్ చూపించడంతో మూర్తి హన్మకొండలో కన్నుమూశారు.
తన మిమిక్రీతో ఎవరినైనా అనుకరించే మూర్తి.. 2018 వరకు బుల్లితెరపై అలరించారు. ఆ తర్వాత ‘ప్యాంక్రియాస్’ క్యాన్సర్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కేవలం మూడు సంవత్సరాలలోనే దాదాపు తన వైద్యం కోసం 16 లక్షలు ఖర్చు పెట్టానని చెప్పాడు.. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. గతంలో మూర్తిని కాపాడుకోవడానికి సుమన్ టీవీ కూడా తన వంతు సాయాన్ని అందించింది. అలాగే.. కొంతమంది దాతలు కూడా మూర్తికి అండగా నిలబడ్డారు. అయినా.. అప్పటికే పరిస్థితి చేజారిపోవడంతో జబర్దస్త్ మూర్తి కన్నుముశారు. మూర్తి మరణవార్త తెలిసి.. ఇండస్ట్రీలో ప్రముఖులు ఆయనకి సంతాపం తెలియజేస్తున్నారు. మరి.. మిమిక్రీ ఆర్టిస్ట్ గా, జబర్దస్త్ కమెడియన్ గా ఇంతటి ఖ్యాతి గడించిన మూర్తి.. ఇలా అకాల మరణం చెందటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.