Ram: టాలీవుడ్ లో ఉన్న పెళ్లికి సిద్ధంగా ఉన్న మోస్ట్ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లో ఒకరు రామ్ పోతినేని. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రామ్.. త్వరలోనే ఓ పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్యకాలంలో తెలుగులో స్టార్ హీరోల పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఏ హీరో ముందుగా పెళ్లి కబురు చెబుతాడా అని చూస్తున్నారు.
ఈ క్రమంలో ఇంతకాలం వినిపించని రామ్ పేరు వినిపించేసరికి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే.. రామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. ముఖ్యంగా రామ్ కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువని తెలిసిందే. సినీవర్గాల తాజా సమాచారం ప్రకారం.. రామ్ తన చిన్ననాటి క్లాస్ మేట్ తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడని, త్వరలో ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుంది.
ఇక ఇన్నేళ్లు పెళ్లి గురించి అడిగితే.. టైమ్ వచ్చినప్పుడు చెప్తానంటూ వచ్చిన రామ్ కి పెళ్లి సమయం ఆసన్నమైందని అంతా అనుకుంటున్నారు. అదీగాక రామ్ కుటుంబసభ్యులు, అమ్మాయి ఫ్యామిలీతో పెళ్లి గురించి చర్చలు జరుపుతున్నారని, అన్నీ కుదిరితే ఈ ఏడాదే రామ్ ఓ ఇంటివాడు కావడం ఖాయమని టాక్. అయితే.. ఇందులో ఎంతవరకు నిజముంది అనేది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ.. రామ్ లేడీ ఫ్యాన్స్ కి మాత్రం ఇది బ్యాడ్ న్యూసే అవుతుంది.
ఇదిలా ఉండగా.. కెరీర్ పరంగా రామ్.. ది వారియర్ సినిమాను పూర్తి చేశాడు. తెలుగుతో పాటు తమిళంలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా.. కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. లింగుస్వామి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత రామ్ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీకి రెడీ అవుతున్నాడు. మరి రామ్ పెళ్లి వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.