ఒకప్పుడు వెండితెర మీద తమ అందం, అభినయంతో కోట్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్‌లు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం తల్లి, అక్క, వదిన ఇలాంటి పాత్రలకు పరిమితం కావాల్సి వచ్చేది. అయితే మారుతన్న కాలంతో పాటు సినిమాలు తెరకెక్కించే విధానం మారుతోంది. కొత్త దర్శకులు సరికొత్త ఐడియాలతో వస్తున్నారు. నవతరం దర్శకులు తెరకెక్కించే కొత్త ప్రాజెక్ట్స్‌లో కథే హీరో, హీరోయిన్. మిగతా వారంతా ఆర్టిస్టులు మాత్రమే. ఇదిగో ఈ కొత్త పద్దతి సీనియర్ హీరోయిన్లకు తెన నచ్చేస్తోంది. మంచి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లు లభిస్తే.. ఎలాంటి పాత్రలు చేసేందుకైనా రెడీ అంటూ కుర్ర హీరోయిన్లకు పోటీగా నిలుస్తున్నారు.
అంతేనా.. రెమ్యూనరేషన్ విషయంలో కూడా యంగ్ బ్యూటీలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓ సీనియర్ హీరోయిన్ పారితోషికంపై ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సదరు నటికి ఒక్కో ఎపిసోడ్‌కు ఏకంగా 5 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అంటున్నారట. ఆ వివరాలు..
అందంతో పాటు అభినయంతో అభిమానుల మనసును కొల్లగొట్టింది బాలీవుడ్ దివా కాజోల్. 90 దశకంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన కాజోల్ హిందీ చిత్రపరిశ్రమను ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ 47 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు అందంలో పోటీ ఇస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌తో వివాహం తర్వాత సైతం అడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటూనే ఉంది. అయితే ఇప్పటికే వెండితెరపై మెరిసిన స్టార్ హీరోయిన్లందరూ తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ జాబితాలో కాజోల్ కూడా చేరిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అందిస్తోన్న ఓ థ్రిల్లర్ షోతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టనుంది. కొన్ని రోజులుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో ఉన్న ఈ షో సోమవారం (జులై 11) ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ఓ వార్త బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారి చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ షోలో ఒక్క ఎపిసోడ్‌కు రూ. 5 కోట్ల పారితోషికాన్ని తీసుకోనుందట కాజోల్.
ఈ విషయంపై బాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ థ్రిల్లర్ షోకు సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా కాజోల్ ప్రస్తుతం నటి రేవతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘సలామ్ వెంకీ’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మరి కాజల్ రెమ్యూనరేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.