మిల్కీ బ్యూటీ తమన్నా ట్రాక్ మార్చేసింది. మునుపెన్నడూ లేని విధంగా బోల్డ్ సీన్స్ లో నటించింది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ఒకటి ఉక్కబోత పెంచేస్తుంది. అందులో తమన్నా ఓ రేంజ్ లో రెచ్చిపోయి మరీ నటించింది.
గ్లామర్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ చాలా ఉండాలి. ముఖ్యంగా హీరోయిన్స్ కైతే మరీను. నటన పరంగా ఎంతున్నా ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలంటే గ్లామర్ డోస్ కూడా పెంచాలి. ఎందుకంటే ఇండస్ట్రీకి కొత్త కొత్త హీరోయిన్స్ వస్తుంటారు. ఈ క్రమంలో ఉన్న హీరోయిన్స్ పాతబడిపోతారు. ఏ హీరోయిన్ అయినా గట్టిగా పదేళ్లు స్టార్ గా కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా కొనసాగాలంటే కష్టమే. స్టార్ హీరోలా తీసుకోరు, అవకాశాలా రావు. పోనీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేద్దామా అంటే అదే పనిగా తీయడం అంటే పనవ్వదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే హీరోయిన్స్ కి ఉన్న ఒకే ఒక్క దారి ఓటీటీ.
మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు అవుతుంది. ఇంకో రెండేళ్లు ఆగితే రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పోటీని నెగ్గుకుని హీరోయిన్ గా కొనసాగాలంటే కష్టం. ఆ విషయం తెలుసుకున్న తమన్నా ఓటీటీ సిరీస్ లపై కన్నేసింది. ఇటు సౌత్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ సినిమాల పరంగా సక్సెస్ రాకపోవడంతో ఓటీటీ సినిమాలకే పరిమితం అయ్యింది. బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ చిత్రాలతో ఓటీటీల్లో సందడి చేసినప్పటికీ పెద్దగా హిట్ అవ్వలేదు. దీంతో కాస్త ఘాటు పెంచింది. జీ కర్దా అనే వెబ్ సిరీస్ లో డోస్ పెంచేసింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ వెబ్ సిరీస్ లో తమన్నా రెచ్చిపోయి మరీ నటించింది. తాజాగా విడుదలైన జీ కర్దా వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాల్లో తమన్నా జీవించేసింది. బెడ్ రూమ్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. పచ్చిగా చెప్పాలంటే పచ్చిగా నటించింది. ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ లకు సెన్సార్ లేని కారణంగా అసభ్యకరమైన పదాలు, విచ్చలవిడి శృంగార సన్నివేశాలు మామూలు అయిపోయాయి. దీన్నే తమన్నా కూడా క్యాష్ చేసుకోవాలని భావించింది కాబోలు. ఎప్పుడూ లేని విధంగా ఇలా అభిమానులకు పిచ్చ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. తమన్నాతో పాటు సుహైల్ నాయర్, ఆషీమ్ గులాటీ, అన్య సింగ్ నటించిన ఈ సిరీస్ జూన్ 15న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఇక మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ కి ఉక్కబోత మొదలవుతున్నట్టే.