తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపు ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నటీమణుల్లో జయసుధ ఒకరు. జయసుధ తన నటనతో సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 40 ఏళ్లనుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు భాషల్లో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ చక్కర్లు కొడుతోంది. జయసుధ రహస్యంగా మూడో వివాహం చేసుకుందన్నది ఆ వార్తల సారాంశం. ఆ వార్తల ప్రకారం.. జయసుధకు వ్యాపారవేత్త కాకర్లపూడి రాజేంద్రప్రసాద్‌తో మొదటి వివాహం అయింది.
కొన్ని మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోయింది. 1985లో ఆమె బాలీవుడ్ హీరో జితేంద్ర కపూర్ బంధువైన నితిన్ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు నిహాన్ కపూర్, శ్రేయాస్ కపూర్ పుట్టారు. 2017లో జయసుధ రెండో భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బిల్డింగ్ మీదనుంచి కిందకు దూకి చనిపోయారు. ఇక, అప్పటినుంచి జయసుధ తమ కుమారులతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను రహస్యంగా వివాహం చేసుకుందట. ఏ ఈవెంట్‌కు అయినా.. ఫంక్షన్‌కు అయినా ఇద్దరూ జంటగా వస్తున్నారట.
మొన్న అలీ కూతురి పెళ్లిలో కూడా ఇద్దరు సందడి చేశారంట. వారిసు ఈవెంట్‌కు కూడా ఆమె అతడితోనే వచ్చిందంట. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయట. ఇక, ఈ వార్తలనే స్థానిక మీడియా దగ్గరినుంచి నేషనల్ మీడియా వరకు రాసుకొచ్చాయి. మరి, ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే జయసుధ నుంచి ఓ ప్రకటన రావాల్సిందే. మరి, సహజ నటి జయసుధ రహస్యంగా మూడో పెళ్లి చేసుకుందని వస్తున్న మీడియా కథనాలు, సోషల్ మీడియా ప్రచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.