యూనిక్ కంటెంట్ తో వచ్చే సినిమాలను ఆదరించేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ముఖ్యంగా భాషాబేధం లేకుండా కంటెంట్ తో కనెక్ట్ అయితే.. సినిమాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఈ విషయం ఇప్పటివరకు చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. అలా ఓ భాషలో మొదలై పాన్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ‘లోకి యూనివర్స్’. తమిళ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సృష్టించిన ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఆల్రెడీ ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్స్ చేరిన సంగతి తెలిసిందే. నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిన లోకేష్.. తదుపరి సినిమాని దళపతి విజయ్ తో చేస్తున్నాడు.
ఇక ఇప్పటికే క్రియేట్ చేసిన లోకి యూనివర్స్ లో.. డిల్లీ క్యారెక్టర్ లో కార్తీ, విక్రమ్ క్యారెక్టర్ లో కమల్ హాసన్, రోలెక్స్ క్యారెక్టర్ లో సూర్య ఎంట్రీ ఇచ్చేశారు. వీరికి సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో అమర్, సంతానం కనిపించి మెప్పించారు. అయితే.. ఈ లోకి యూనివర్స్ లో నెక్స్ట్ ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ సినిమాలు రాబోతున్నట్లు ఆల్రెడీ లోకేష్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఎప్పుడెప్పుడు ఖైదీ 2 లేదా విక్రమ్ 2 మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే.. వాటికంటే ముందు ‘విజయ్ 67’ ఉంది. కాబట్టి.. ఆ సినిమా తర్వాతే ఏదొక సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రమంలో లోకి యూనివర్స్ లోకి ఒక్క తెలుగు హీరో అయినా ఎంటరైతే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఓ టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ లోకి యూనివర్స్ లో అడుగు పెట్టనున్నాడని టాక్ వైరల్ గా మారింది. ఆ హీరో ఎవరో కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అవును.. పుష్ప మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ.. ప్రెజెంట్ పుష్ప 2 పై ఫోకస్ పెట్టాడు. ఓకే పుష్ప 2 తర్వాత ఏం చేయబోతున్నాడు? అనే ప్రశ్నకు సమాధానంగా లోకి యూనివర్స్ ని చర్చల్లోకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవల బన్నీతో లోకేష్ కనకరాజ్ చర్చలు జరిపాడట. మరి వీరి చర్చలు సినిమా గురించి జరిగాయా? లేక ఖైదీ, విక్రమ్ సినిమాలు చూసి బన్నీ లోకేష్ ని అభినందించాడా? అనే సందేహాలు మొదలయ్యాయి.
ఇవన్నీ కాదు.. ఖైదీ 2, విక్రమ్ 2 లేదా రోలెక్స్.. ఇలా ఏదొక సిరీస్ లో బన్నీని ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని.. లోకేష్ కూడా బన్నీని రోలెక్స్ పాత్రలో సూర్యని ఇంట్రడ్యూస్ చేసినట్లుగా.. పవర్ ఫుల్ రోల్ తో తన యూనివర్స్ లో ప్రెజెంట్ చేయనున్నట్లు సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అదేంటీ ఆల్రెడీ లోకేష్.. విజయ్ 67, ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ లతో బిజీ కదా! అనుకోవచ్చు. కానీ.. వీరి కాంబినేషన్ సెట్ అవ్వడానికి టైం పడుతుందట. కానీ.. పక్కాగా ఓ పవర్ ఎంట్రీతో బన్నీ లోకి యూనివర్స్ లో అడుగు పెట్టడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి.. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 తప్ప వేరే ఏది ఓకే చేయలేదు. సో.. లోకేష్ తో బన్నీ మూవీ ఉండబోతుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ బన్నీ నిజంగానే లోకి యూనివర్స్ లో కన్ఫర్మ్ అయితే ఎలా ఉంటుందో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Lokesh Kanagaraj – Allu Arjun Project
Talks Going On 💥💥💥💥
Another New Character Entering Into LCU..🤜🤛
Allu Arjun Fans Dream 🙏🏻🙏🏻🙏🏻#AlluArjun𓃵 #Thalapathy67𓃵 pic.twitter.com/tTVm1wcnJD
— Manish Vasudevan (@ManishVasu30) January 6, 2023