సాధారణంగా పెళ్లైన జంట ఏకాంతాన్ని కోరుకుంటారు. అందులో భాగంగానే వారు కొన్ని ప్రాంతాల్లో విహరిస్తారు. దాన్నే నేటి ఆధునిక యుగంలో హనీమూన్ అంటాం. ప్రస్తుతం ఈ కల్చర్ ప్రపంచం అంతటా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా పెళ్లైన నయన్ – విఘ్నేశ్ ల జంట స్పెయిన్ లో హనీమూన్ ట్రిప్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇప్పుడు వీరి హనీమూన్ ట్రిప్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
నయనతార-విఘ్నేశ్ శివన్ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 6 ఏళ్లుగా ప్రేమ ప్రయాణం చేసిన ఈ జంట రెండు నెలల క్రితం ఒక్కటైన విషయం అందరికి తెలిసిందే. పెళ్లి తర్వతా ఈ జంట హనీమూన్ కోసం విదేశాల్లో విహరిస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోలను నయన్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంది. అయితే ఇప్పుడు వీరి గురించి ఓ వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.
అదేంటంటే వీరి హనీమూన్ ట్రిప్ కు ఒక్క పైసా కూడా తమ జేబుల్లోంచి పెట్టడం లేదంట. అలాగే వారి హోటల్ రూం అద్దె, వారి ఇతర ఖర్చులను ఒక ప్రముఖ కంపెనీ స్పాన్సర్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఇప్పటి వరకైతే ఈ నవ జంట ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ వార్త విన్న కొందరు నెటిజన్స్ స్పందిస్తూ.. ”ఆహా దేనికైనా పెట్టి పుట్టాలి అంటూ.. ఈ అవకాశం మాకు ఇవ్వండి” అంటూ ఆ కంపెనీని సరదాగా కోరుతున్నారు. మరి పైసా ఖర్చు చేయకుండా హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్న నయన్ దంపతులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.