చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రేక్షకులను అలరించి.. కొన్నాళ్ల పాటు సినిమాల్లో కనిపించకుండా సైలెంట్‌గా స్టడీస్, యాక్టింగ్, డ్యాన్స్ వంటి వాటిలో ట్రైనింగ్ తీసుకుని హీరో లేదా హీరోయిన్లుగా ఎంటర్ అయ్యి షాక్ ఇచ్చిన వారు చాలామందే ఉన్నారు.
చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రేక్షకులను అలరించి.. కొన్నాళ్ల పాటు సినిమాల్లో కనిపించకుండా సైలెంట్‌గా స్టడీస్, యాక్టింగ్, డ్యాన్స్ వంటి వాటిలో ట్రైనింగ్ తీసుకుని హీరో లేదా హీరోయిన్లుగా ఎంటర్ అయ్యి షాక్ ఇచ్చిన వారు చాలామందే ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్‌గా తేజ సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్ (బలగం ఫేమ్) లను చెప్పుకోవచ్చు. బాల నటులు మరి కొందరు ఇప్పటికే సినిమాలు చేస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న పిల్లాడు కూడా యమా యాక్టివ్. డ్యాన్స్ భలే చేస్తాడు. సొంతగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మనోడికి. యాక్టింగ్, నాట్యం ఏదైనా కానీ సినిమా అంటే చాలా ఇష్టం. దాంతో చదువుతో పాటు తన ప్యాషన్ కోసం కూడా టైం కేటాయించుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ్ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగ దాస్ కాంబోలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘స్పైడర్’. దాదాపు రూ. 125 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళంలో తెరకెక్కించారు. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించగా, యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్.జె.సూర్య విలన్‌గా కనిపించారు. అప్పటికి తెలుగులో ‘ఖుషి’, ‘నాని’, ‘కొమరం పులి’ సినిమాలు డైరెక్ట్ చేసిన సూర్య కొంత గ్యాప్ తర్వాత పూర్తి స్థాయిలో ‘భైరవుడు’ అనే ప్రతినాయకుడిగా చేశారు. అయితే ఇందులో చిన్నప్పటి ‘భైరవుడి’ గా మాస్టర్ సంజయ్ నటించాడు. ఎవరైనా చనిపోయినప్పుడు, వారి బంధువులు ఏడ్చే ఏడుపులో ఆనందాన్ని వెతుక్కునే డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న క్యారెక్టర్ విలన్‌ది. చిన్నప్పటి ఆ పాత్రలో సంజయ్ బాగా పర్ఫామ్ చేశాడు.
‘స్పైడర్’ తర్వాత కోలీవుడ్‌లో ‘మూగముని’, ‘జాక్ పాట్’, ‘దర్బార్’ వంటి పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు. చెన్నైలో పుట్టిన సంజయ్ ‘కుట్టి టాకీస్’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. అందులో ఫుడ్, డ్యాన్స్ వీడియోస్ కూడా పెడుతుంటాడు. ఇక తను చేసే రీల్స్, డ్యాన్స్ వీడియోలను ‘స్పైడర్ సంజయ్’ అనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటాడు. మంచి ఈజ్, ఎనర్జీతో సంజయ్ వేసే స్టెప్స్ బాగుంటాయి. ‘ఇంకాస్త పెద్దయ్యాక హీరోగా ట్రై చెయ్ బ్రో’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.