తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న వినోదాత్మక కార్యక్రమాలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో.. మొదటి నుండి వినూత్నమైన ప్రోగ్రామ్స్ ద్వారా కొత్త టాలెంట్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ప్రతివారం ఏదొక థీమ్ తో షోని ముందుకు తీసుకెళ్తున్నారు నిర్వాహకులు. జబర్దస్త్ తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షో.. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమవుతుంది. అయితే.. ఏ ఎపిసోడ్ ప్లాన్ చేసినా.. ముందుగా ప్రోమో రిలీజ్ చేస్తుంటారు. అలాగే ఈసారి ‘జాతీయ రైతుల దినోత్సవం’ సందర్భంగా వ్యవసాయం థీమ్ తో ఎపిసోడ్ ప్లాన్ చేశారు.
తాజాగా రాబోయే ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో వదిలారు నిర్వాహకులు. ప్రోమో అంతా యాంకర్ రష్మీ, హైపర్ ఆది, జడ్జి ఇంద్రజలతో పాటు పలు ఎంటర్టైనింగ్ స్కిట్స్ తో సందడిగా సాగింది. కానీ.. చివరికి వచ్చేసరికి నిజమైన రైతులను షోలో ప్రవేశపెట్టడం విశేషం. ముందుగా రైతులతో కూడా పంచులు వేయించారు. ఆ తర్వాత వ్యవసాయం గురించి.. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. జడ్జి ఇంద్రజతో పాటు స్టేజ్ పై ఉన్నవారంతా ఎమోషనల్ అయిపోయారు. రైతులు పండిస్తేనే ఈ లోకమంతా కడుపునిండా భోజనం చేయగలుగుతోంది. కానీ.. రైతుల గురించి తక్కువగా మాట్లాడటం ఇప్పటికి చూస్తూనే ఉన్నాం.
ఈ క్రమంలో రైతులతో మాట్లాడుతూ.. ‘మీరు వ్యవసాయం చేస్తూ నష్టపోతున్నారు..’ అని ఇంద్రజ అడగ్గా.. ‘నష్టపోతున్నాం.. మరి వేరే పనులు మేం చేయలేమండీ.. ఈ రెండు సంవత్సరాలలో పది లక్షల వరకు నష్టపోయాం.’ అన్నారు ఒక రైతు. మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళని వ్యవసాయంలోకి తీసుకురావాలని లేదా? అని అడగ్గా.. ‘మా పిల్లలు మాలాగా బాధ పడకూడదు. వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు.’ అని చెప్పారు. దీంతో ప్రస్తుతం రైతుల పరిస్థితి అలా ఉందంటూ.. స్టేజ్ పైనే ఇంద్రజ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. మరి జాతీయ రైతుల దినోత్వవం(డిసెంబర్ 23) సందర్భంగా రైతులు, వ్యవసాయం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.