ఇటీవలి కాలంలో కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు క్రేజ్ పెరుగుతోంది. సినిమా కావచ్చు లేదా కంటెంట్ ఓరియంటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు కామెడీ ప్రధానంగా ఉంటే హిట్ అయినట్టే. అందుకే చాలామంది కమెడియన్లకు ఇప్పుడు స్టార్ హోదా దక్కింది. ఈ క్రమంలో ఆ ఐదుగురు కమెడియన్ల సంపాదన తెలిస్తే మతి పోవడం ఖాయం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కామెడీకు మంచి మార్కెట్ ఉంది. అందుకే కామెడీ సినిమాలే కాదు బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షోలకు డిమాండ్ పెరుగుతోంది. హీరోలతో సమానంగా కొందరు కమెడియన్లు స్టార్ డమ్ సంపాదించుకుంటున్నారు. అటు ఆదాయంలో కూడా హీరోలకు తీసిపోకుండా ఆర్జిస్తున్నారు. కొందరైతే హీరోలను దాటి కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటి టాప్ 5 కమెడియన్లు ఎవరున్నారు, వారి సంపాదన ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో అత్యధికంగా సంపాదించే టాప్ 5 కమెడియన్లలో మొదటి స్థానంలో ఉంటాడు కపిల్ శర్మ. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే కపిల్ శర్మ షోకు ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లు ఉన్నారు. కేవలం 500 రూపాయలతో కెరీర్ ప్రారంభించిన కపిల్ శర్మ ఇప్పుడు 300 కోట్ల ఆస్థులకు యజమాని. బహుశా రిచెస్ట్ కమెడియన్ ఇతడే కావచ్చు. ఇక రెండో స్థానంలో ఉంటాడు కృష్ణ అభిషేక్. అద్భుతమైన టైమింగ్ కామెడీ ఇతని సొంతం. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో కూడా కొన్ని పాత్రలు పోషిస్తుంటాడు. బోల్ బచ్చన్, ఎంటర్‌టైన్‌మెంట్, క్యా కూల్ హై హమ్ 3 సినిమాల్లో నటించాడు. ఇతని మొత్తం ఆస్థుల విలువల 40 కోట్లు ఉంటుందని అంచనా.
ఇక మూడో స్థానంలో కికు శారదా పేరు చెప్పుకోవాలి. ది కపిల్ శర్మ షో ద్వారా ప్రాచుర్యమైనా పంచ్ లైన్ టాక్ టు మై హ్యాండ్ అందరికీ పరిచయం. ఇతని ఆస్థుల విలువ 33 కోట్ల నుంచి 40 కోట్లు ఉంటుంది. నాలుగో స్థానంలో నిలుస్తుంది విమెన్ కమెడియన్ భారతీ సింగ్. కామెడీ సర్కస్, ది కపిల్ శర్మ షోలతో అందరికీ పరిచయం. ఈమె ఆస్థి విలువ 25-30 కోట్లు ఉంటుంది.
ఇక ఐదో స్థానంలో నిలుస్తాడు మరో కమెడియన్ సునీల్ గ్రోవర్. ది కపిల్ శర్మ షో ద్వారా సునీల్ గ్రోవర్ అంటే తెలియనివాళ్లుండరు. గుత్తి, డాక్టర్ మషూర్ గులాటి, రింకూ భాబి వంటి పాత్రలతో ఆకట్టుకున్నాడు. ఏడేళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో కన్పిస్తున్నాడు. ఇతని మొత్తం ఆస్థుల విలువ 21 కోట్లు ఉంటుంది.