దేశభక్తి సినిమాలు ఎక్కడైన సరే విశేషంగా ఆకట్టుకుంటు ఉంటాయి. చరిత్రలను చూపూతు చాలా సినిమాలు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద మంచి కలేక్షన్స్ రాబట్టాయి. కొన్ని చిత్రాలు చరిత్ర సృష్టస్తే.. మరికొన్ని యావరేజ్‌గా నిలిచాయి. కానీ దేశభక్తి సినిమా అంటే అందరూ ఒక్కసారైనా చూడాలని ఉంటుంది. జనాలను ఆకట్టుకున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.
సినీ పరిశ్రమలో దేశభక్తి సినిమాలకు మంచి మార్కేట్ ఉంది. తీసే విధానం ఉండాలే కాని దేశభక్తి చిత్రాలు థియేటర్ల వద్ద సంచలనాలు సృష్టిస్తాయి. సినీ రంగంలో దేశభక్తితో అనేక చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలు చిన్న, పెద్ద తెడా లేకుండా అందరిలో దేశభక్తి భావాన్ని గుండేల్లో నింపుతున్నాయి. నేడు ఆగస్టు 15 సందర్బంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా కొన్ని సినిమాలు గురించి తెలుసుకుందాం. “ఖడ్గం”.. స్వాతంత్ర దినోత్సవం రోజు టీవీలో వచ్చే చిత్రాల్లో ఖడ్గం సినిమా ముందువరుసలో ఉంటుంది. ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు. ఈ సినిమాలోని పాటలు ఎవర్ గ్రీన్. ఈ సినిమా 1990లో ముంబైలో జరిగిన దాడుల్లో చాలా మంది చనిపోయారు. దాని ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు కృష్ణవంశీ. అప్పట్లో ఈ మూవీ సంచలన విజయం సాధించింది.
“మేజర్”.. ఈ సినిమా ముంబై దాడుల్లో మరణించిన భారతీయ సైనికుడు మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. యుద్ద సమయంలో తను చేసిన త్యాగాల గురించి చూపుతూ.. చాలా మంచిగా తీసారు దర్శకుడుశశి కిరణ్ టిక్కా. రాజమౌళి తెరకెక్కించిన సినిమా “ఆర్ ఆర్ ఆర్” ఈ సినిమా 1920లో భారతదేశంలో స్వేచ్చా కోసం పోరాడిన ఇద్దరి వ్యక్తుల చరిత్రాత్మక కథ ఇది. అల్లురి సితారామరాజు, కొమురం భీం కలిసి బ్రిటిష్ వారిని ఎదురించిన సంఘటనలు ఈ సినిమాలో చూపెట్టారు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. “భారతీయుడు”.. ఈ సినిమా ఇండియా బాగు కోసం పోరాడిన ఒక వ్యక్తి గురించి ఉంటుంది. అతను చేసిన త్యాగాలు, దేశంలో అవినీతి పాల్పడిన వారిని అంతం చేసే ఒ సిటిజన్‌గా కమల్ హాసన్ నటించారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద విజయం సాధించింది.
“ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్” ఈ సినిమా భారతదేశంలో స్వేచ్ఛ కోసం పోరాడిన చరిత్రాత్మక వ్యక్తి భగత్ సింగ్ గురించి ఉంటుంది. ఇది అతని జీవితం, అతను చేసిన త్యాగాల, బ్రిటీష్ వారిని ఎదురించిన తీరు గురించి చూపుతుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ అద్బుతంగా నటించారు. ఇలా దేశభక్తి చాటుతూ.. చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో మరికొన్ని.. అల్లురి సితరామరాజు, మేజర్ చంద్రకాంత్, భారతీయుడు,సుభాష్ చంద్రబోస్, మహాత్మ, సైరా నరసింహరేడ్డి, ఘాజి, గదర్- ఏక్ ప్రేమ్ కథ, జై, పరమ వీరచక్ర, లగాన్, దంగల్ వంటి చిత్రాలు వచ్చి జనాలు అకట్టుకున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని దేశభక్తి చిత్రాలు వస్తే జనాలు తప్పకుండా ఆధారిస్తారు.