ఆమెని చూసిన ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. అంత బాగుంటుంది. హీరోయిన్ గా మాస్ పాత్ర చేసినా, మోడ్రన్ డ్రస్ లో హాట్ నెస్ చూపించినా ఆమెకే చెల్లుతుంది. స్వతహాగా ఆమె బాక్సర్. కానీ అదృష్టం కలిసొచ్చి హీరోయిన్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే వరసపెట్టి హిట్లు కొడుతూ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలువురు యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలోనూ గ్లామరస్ ఫొటోలతో ఈమె చేసే హడావుడి మాములుగా ఉండదు. మరి ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి రితికా సింగ్. విక్టరీ వెంకటేశ్ ‘గురు’ సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈమెనే. ఇక ఈమె వ్యక్తిగత విషయానికొస్తే.. ముంబయిలో పుట్టిపెరిగిన ఈమె.. చిన్నప్పటి నుంచి మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. తండ్రి ట్రైనింగ్ లో రాటుదేలి ‘సూపర్ ఫైట్ లీగ్’ తొలి సీజన్ లో పార్టిసిపేట్ చేసింది. ఇక డైరెక్టర్ సుధా కొంగర.. తన తొలి సినిమా కోసం నిజమైన బాక్సర్ ని వెతికే క్రమంలో రితిక కనిపించింది. అలా ఈమెతో ‘సాలా ఖాదూస్/ఇరుది సుట్రూ’ చేసింది. తమిళ్, హిందీలో ఇది సూపర్ అయింది. దీన్నే తెలుగులో ‘గురు’ పేరుతో రీమేక్ చేయగా.. ఇక్కడ కూడా హిట్ అయింది. దీంతో బాక్సర్ కాస్త హీరోయిన్ అయిపోయింది.
ఇక తెలుగులో ‘నీవెవరో’ అని మరో సినిమా చేసింది. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పెద్దగా ఆదరణ రాలేదు. దీంతో రితికా సింగ్.. తమిళంలోకి షిప్ట్ అయిపోయింది. అక్కడే శివలింగ, ఓ మై కడవులే లాంటి సినిమాలు చేసి హిట్స్ కొట్టింది. ప్రస్తుతం రితిక చేతిలో.. బాక్సర్, వనంగమూడి, కోలై, కింగ్ ఆఫ్ కోటా, బాక్సర్ లాంటి తమిళ్, మలయాళ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇదంతా పక్కనబెడితే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేసే ఈమె.. నెటిజన్లను బాగానే ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది.