ఈ ఫోటోలో ఉన్న బాబుని గుర్తుపట్టారా? బాబు ల్యాండ్ అయితే బాక్సాఫీస్ కి బ్యాండే. అందంలోనూ, అభినయంలోనో సరిలేరు తనకెవ్వరు అని అనిపించుకున్నారు.
బాల్యం అనేది ఒక మధుర జ్ఞాపకం. చిన్నప్పుడు కొన్ని సందర్భాల్లో తీసిన ఫోటోలను, వీడియోలను జాగ్రత్తగా దాచి పెట్టుకుని పెద్దయ్యాక చూసుకోవడం.. లేదా తమ పిల్లలకి చూపించడమనేది ఓ మధురానుభూతి. సెలబ్రిటీల చైల్డ్ హుడ్ మెమోరీస్ ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. పై ఫోటోలో అందరి కన్నా చిన్న కటౌట్ ఒకటి ఉంది. అమాయకంగా చూస్తున్న ఆ బాబు ఎవరో గుర్తుపట్టారా? తండ్రి నుంచి నటనను, క్రమశిక్షణను, సేవాగుణాన్ని వారసత్వంగా తీసుకున్న సూపర్ హీరో. అతి తక్కువ సమయంలో తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. చేసే క్యారెక్టర్ కోసం దేనికైనా సిద్ధం అంటాడు. ఆ పాత్రలో ఇన్వాల్వ్ అవడం తనకి ప్లస్ పాయింట్.
తన నటనతో ఇతర ఇండస్ట్రీల్లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు. ఎవరీ బాబు అనుకుంటున్నారా? అతడు ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆగస్టు 9న పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ అతని చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. కొత్త కథలను ఎంచుకుని అద్బుతమైన పాత్రలు చేసి ప్రేక్షకాభిమానులను అలరించాడు. మహేష్ బాబు సినీ ప్రస్థానానికి వస్తే ‘నీడ’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం వంటి సినిమాల్లో నటించాడు. ఇక రాజకుమారుడు చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టాడు.
ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు ఫ్లాప్ కాగా, 2001లో వచ్చిన మురారి సినిమా మహేష్‌కు భారీ విజయం అందించింది. 2003లో వచ్చిన ఒక్కడు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమాకి గానూ నంది అవార్డు అందుకున్నాడు. అయినా మహేష్ బాబుకి ఏదో తీరని లోటు ఉండేది. ఒక్కటైన ఇండస్ట్రీ హిట్ కొట్టాలని అనుకున్నాడు. చాలా కథలు విన్నాడు కానీ ఏదీ నచ్చలేదు. పూరీ జగన్నాథ్ చెప్పిన పోకిరి కథ విని ఓకే చేశాడు. మహేష్ అంటే ఏంటో ఈ సినిమాతో చూపించాడు. అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకు పోయాయి. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్స్ నమోదయ్యాయి. ఒక్కసారిగా మహేష్ అంటే ఏంటో ఈ సినిమాతో రుజువు చేశాడు.
పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత దూకుడు, శ్రీమంతుడు, మహర్షి, బిజినెస్‌మెన్ వంటి చిత్రాలు హహేష్‌కు భారీ విజయాన్ని తీసుకొచ్చాయి. తాజాగా త్రివిక్రమ్ కాంబినేషన్‌లో గుంటూరు కారం సినిమాలో చేస్తున్నాడు. అది పూర్తి అయిన వెంటనే ఎస్ఎస్ రాజమౌళితో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్, లవ్, ఎమోషన్ ఏదైనా అద్భుతంగా పండించగలడు మహేష్. కేవలం యాక్టర్‌గానే కాకుండా, సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్‌లు చేయిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అలాగే కొన్ని కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా కొనసాగుతున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా బిజినెస్ మేన్ సినిమాని 4కేలో రీ రిలీజ్ చేశారు. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. మరి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి.