ఆమె అచ్చతెలుగమ్మాయి. పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. టీనేజ్ లోనే హీరోయిన్ అయిపోయింది. చాలా తక్కువ టైంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఆమె పుట్టిపెరిగింది అంతా ఆంధ్రాలోనే. చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్న ఆమె.. ఓసారి స్కూల్ లో డ్యాన్స్ చేస్తుండగా స్టార్ డైరెక్టర్ కంట్లో పడింది. అంతే ఆమె దశ తిరిగిపోయింది. 13 ఏళ్లకే హీరోయిన్ అయిపోయింది. కెరీర్ లో దాదాపు 300 సినిమాల వరకు చేసింది. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ లో చాలా మూవీస్ చేసింది. చెప్పాలంటే వాళ్లనే వెయిట్ చేసేంత స్థాయికి వెళ్లింది. ఆమె చేసిన సినిమాలన్నీ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి లైఫ్ ని ఆస్వాదిస్తున్న సదరు బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు కొన్ని తాజాగా వైరల్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు మాధవి. అవును మీరు గెస్ చేసింది రైట్. హీరోయిన్ మాధవి. మెగాస్టార్ చిరంజీవితో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ , కోతల రాయుడు, ప్రాణం ఖరీదు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ఖైదీ, బిగ్ బాస్ లాంటి సినిమాల్లో చిరు-మాధవి జోడీగా నటించారు. వీళ్ల పెయిర్ గా ఓ మూవీ వస్తుందంటే చాలు.. అప్పట్లో టాలీవుడ్ ఆడియెన్స్ తెగ వెయిట్ చేసేవారు. అంతలా ఫేమస్. ఏలూరు పుట్టిన ఈమె అసలు పేరు కనక మహాలక్ష్మి. 1965 సెప్టెంబరు 4న పుట్టింది. చిన్నప్పటి నుంచి భరతనాట్యంపై ఆసక్తి చూపించడంతో మాధవి తల్లి ఆవైపు ప్రోత్సాహించింది. 8 ఏళ్ల వయసు నుంచే స్టేజీ ఫెర్ఫార్మెన్సులు ఇవ్వడం స్టార్ట్ చేసిన మాధవి.. 300 వరకు ప్రదర్శనలు ఇచ్చింది.
అబిడ్స్ లోని స్కూల్ లో చదువుతున్న టైంలో ఓ రోజు దర్శకరత్న దాసరి నారాయణరావు.. కనకమహాలక్ష్మి(మాధవి) చదువుతున్న స్కూల్ కి వెళ్లారు. ఆమె నాట్యం చూసి తెగ మురిసిపోయి.. తాను తీసిన ‘తూర్పు పడమర’లో తొలి అవకాశం ఇచ్చారు. అలా 13 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమెకు వరసగా ఛాన్సులు వచ్చాయి. అయితే దాదాపు 17 ఏళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్న మాధవి.. కెరీర్ చివర్లో ‘మాతృదేవోభవ’ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ అలా గుర్తుండిపోయింది. ఆధ్యాత్మిక గురువు రామస్వామికి భక్తురాలు అయిన ఈమె.. ఆయన చెప్పడంతో బిజినెస్ మేన్ రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై అమెరికాలో సెటిలైపోయింది. వీళ్లకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక బిజినెస్ పై ఇంట్రెస్ట్ పెరగడంతో.. భర్త మెడికల్ కంపెనీతోపాటు ఫుడ్ రెస్టారెంట్స్ ని చూసుకుంటూ వాటిని సక్సెస్ చేసింది. ఇప్పుడు మాధవి ఆస్తి వేలకోట్లు ఉంటుంది. సరే ఇదంతా పక్కనబెడితే ప్రస్తుత ఫొటో చూసి ఈమెని ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.