రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఫ్లాప్ అయిండొచ్చు కానీ మనోడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మనకంటే నార్త్ ఆడియెన్స్ విజయ్ అంటే పిచ్చి ఇష్టం చూపిస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్లు సైతం విజయ్ అంటే పడిచచ్చిపోతున్నారు. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో బయటపెట్టారు. ఏకంగా డేటింగ్ చేయాలని ఉందంటూ తన ప్రేమని రివీల్ చేశారు. మరోవైపు విజయ్.. ఓ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడని గత కొన్నాళ్ల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో ఓ ఫొటో వైరల్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ కుర్రహీరోల్లో విజయ్ దేవరకొండ టాప్ లో ఉన్నాడు. అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ అవి హిట్ కొట్టలేకపోతున్నాయి. అయినా మనోడి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ ఏడాది ‘లైగర్’తో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టాలని ప్లాన్ చేశాడు. కానీ అది ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమాల సంగతి పక్కనబెడితే హీరోయిన్లలో మనోడికి మంచి క్రేజ్ ఉంది. గతంలో ‘కాఫీ విత్ కరణ్’ షోలోనూ విజయ్ గురించి జాన్వీ-సారా అలీఖాన్ ఫన్నీగా గొడవపడ్డారు.
ఇక ఇప్పుడు హీరోయిన్ జాన్వీ కపూర్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీల మధ్య మంచి బాండింగ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోనే దీనికి ఉదాహరణ. రీసెంట్ గా విజయ్, ఓ యాడ్ షూటింగ్ కోసం ముంబయి వెళ్లాడు. ఇందులోనే జాన్వీతో కలిసి యాక్ట్ చేశారు. ఈ సందర్భంగానే విజయ్ తల్లితో జాన్వీ ఫొటో తీసుకుంది. ఇప్పుడదే బయటకొచ్చింది. షూటింగ్ తర్వాత విజయ్ ఫ్యామిలీని జాన్వీ, తన ఇంటికి ఆహ్వానించిందట. మరోవైపు విజయ్-జాన్వీ కలిసి యాక్ట్ చేసే చూడాలని ఉందంటూ పలువురు అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి.. బిగ్ స్క్రీన్ పై ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో?
In the picture here,
Vijay Deverakonda’s mother Madhavi with Bollywood Diva Jahnvi Kapoor.
What’s happening? pic.twitter.com/sk8YKFJo5B
— MIRCHI9 (@Mirchi9) December 5, 2022