ప్రముఖ హీరోయిన్ ఇలియానా డీ క్రూస్ అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తిండి తినే పరిస్థితి కూడా లేకపోవటంతో శనివారం వైద్యులు ఆమెకు సెలైన్స్ ఎక్కించారు. దాదాపు మూడు బాటిళ్ల సెలైన్స్ నీళ్లను నరాల ద్వారా శరీరంలోకి ఎక్కించారు. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తన అనారోగ్యం గురించి ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని స్టోరీస్ పెట్టారు. ఆ స్టోరీస్‌లో.. ‘‘ ఓ రోజులో ఎంత మార్పు. మంచి డాక్టర్లు.. 3 బ్యాగుల ఐవీ లిక్విడ్స్’’ అని పేర్కొన్నారు. అనంతరం పెట్టిన మరో స్టోరీలో..
‘‘ అందరూ నా ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు చూపిస్తున్న ఇదికి నా కృతజ్ఞతలు. మీ ప్రేమాభిమానాలను మెచ్చుకుంటున్నాను. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. నాకు మంచి వైద్యం అందుతోంది’’ అని తెలిపింది. ప్రస్తుతం ఆమె స్టోరీకి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందిస్తున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా, ఇలియానా 2006లో వచ్చిన దేవదాసు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన నటించారు.
పోకిరి సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతో ఆయన సినిమాలు చేశారు. హుడగా, హుడిగి సినిమాతో కన్నడలోకి అడుగుపెట్టారు. ఫటా పోస్టర్ నికలా హీరో సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటినుంచి తెలుగు సినిమాకు దూరం అయ్యారు. 2018లో వచ్చిన అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాతో మళ్లీ తెలుగులోకి వచ్చారు. ఇప్పుడు హిందీలో సినిమాలు చేస్తున్నారు. సరైన ఆఫర్లు లేక ఇబ్బంది పడుతున్నారు. మరి, ఇలియానా డీ క్రూస్ అనారోగ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.