అసలే ఇది పెళ్లిళ్ల సీజన్. సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పెళ్లి చేసేసుకుంటున్నారు. తమకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసేస్తున్నారు. మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా, ఎక్కడ చూసినా సరే సెలబ్రిటీల పెళ్లి ఫొటోలే కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో హీరోయిన్ అంజలి షాకింగ్ విషయం చెప్పింది. ఈమె పెళ్లి చేసేసుకుంది అనే న్యూస్ గత కొన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు దీనిపై అంజలినే క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ అంజలి అచ్చ తెలుగమ్మాయి. ఇక్కడే పుట్టిపెరిగినప్పటికీ.. తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి మూవీతో ఇక్కడ కూడా చాలా ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికీ.. తమిళంలోనే చాలా క్రేజ్ వచ్చింది. కొన్నాళ్ల ముందు వరకు అక్కడే సినిమాలు చేస్తూ వచ్చిన అంజలి.. హీరో జైతో రిలేషన్ లోనూ ఉన్నట్లు అప్పట్లో వార్తలు చాలా వచ్చాయి. వీటిని ఆ ఇద్దరిలో ఎవరూ ఖండించకపోయేసరికి చాలామంది నిజమేనని అనుకున్నారు.
అయితే కొన్ని వివాదాలు జరగడంతో అంజలి, హైదరాబాద్ కు మకాం మార్చేసింది. తెలుగు మూవీస్ లో ఐటమ్ సాంగ్స్ ఓవైపు, ఓటీటీల్లో వెబ్ సిరీసులు మరోవైపు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గానే ‘ఫాల్’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇందులో భాగంగానే చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టగా.. అంజలిని ప్రేమ-పెళ్లి గురించి అడిగారు. ‘నాకు ఇప్పటికే పెళ్లయిపోయిందని, అమెరికాలో ఉంటున్నట్లు చాలా ప్రచారం జరిగింది. నిజానికి ఇవన్నీ రూమర్స్ మాత్రమే. ప్రస్తుతానికైతే నాకు పెళ్లి చేసుకునే ఆలోచన అసలే లేదు. కానీ పెళ్లి మాత్రం కచ్చితంగా చేసుకుంటాను. ఆ టైం వచ్చినప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటాను’ అని అంజలి క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోయారు.