సినీ ఇండస్ట్రీలో మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ మేనియా సాగితే ఇప్పుడు ఎక్కడ చూసినా కేజీఎఫ్ 2 గురించిన చర్చే నడుస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేజీఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే దాదాపు రూ. 700 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. కేజీఎఫ్ 1 తో తనకంటూ ఒక మార్క్ చాటుకున్న యష్ ఇప్పుడు కేజీఎఫ్ 2 తో నేషనల్ స్టార్ గా సత్తా చాటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా యష్ పేరు మారు మారుమోగుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ మూవీ సక్సెస్ కావడంతో విజయోత్సవాలు చేసుకుంటున్నారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా పలు ఛానల్స్ కి హీరో యష్ ఇంటర్వ్యూలు ఇస్తు వస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో మీరు ఏ హీరోయిన్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు.. ఎవరితో నటించాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్శకు దీపికా పదుకొనే అంటూ టక్కున సమాధానం ఇచ్చాడు హీరో యష్. ఆమె నటన చాలా బావుంటుందని, ఆమె సినిమాలను చూస్తూ ఉంటానని యష్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్ లో హీరో యష్ తో మూవీ తీసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి యష్ మనసులోని మాటను ఏ డైరెక్టర్ నెరవేరుస్తాడో చూడాలి. మరోవైపు కేజీఎఫ్2 మూవీ సక్సెస్ తో బాలీవుడ్ లో యష్ కి మంచి క్రేజ్ వచ్చింది. యశ్ తర్వాత సినిమాలకు కూడా హిందీలో కళ్లు చెదిరే స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం అయితే ఉంది.