ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అన్నాక వెయ్యి కళ్ళు వారిమీదే ఉంటాయి. దాంతో వారు ఎక్కడికి వెళ్లినా తెలిసిపోతుంది. పైగా నేటి సోషల్ మీడియా ఆధునిక కాలంలో ఇలాంటి విషయాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక సెలబ్రిటీల పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ చెక్కర్ల కొడుతుంటాయి. అయితే ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ లు, పెళ్లిళ్లు, విడాకులు కామన్. చాలా మంది సెలబ్రిటీ ప్రేమ జంటలు కెమెరాలకు చిక్కినప్పటికీ తమ మధ్య ఏ సంబంధం లేదని చెబుతుంటారు. అయితే నిప్పు లేనిదే పొగ ఎక్కడి నుంచి వస్తుందిలే అంటుంటారు వారిని చూసిన వారంత. తాజాగా మరో ప్రేమ జంట ముంబై లోని ఓ హోటల్లో కెమెరా కంటికి చిక్కారు. గత కొన్నిరోజులుగా వీరిపై నెట్టింట వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ జంట ఎవరంటే?
సాధారణంగా ఇండస్ట్రీలో ఓ సినిమాలో కలిసి నటించిన హీరో, హీరోయిన్ ల మధ్య సహజంగానే స్నేహం ఉంటుంది. కొన్ని జంటలలో ఈ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో.. ప్రేమాయణం మెుదలు పెడతారు. మరి కొన్ని జంటలు డేటింగ్ అంటూ కొన్నిరోజులు కలిసి తిరిగి తర్వాత ఎవరిదారిన వారు వెళతారు. ఇంకొంత మంది సెలబ్రిటీలు మాత్రం కెమెరా కంటికి చిక్కినప్పటికీ మేం లవర్స్ కాదంటూ సమాధానాలు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ జంట ముంబైలోని ఓ హోటల్లో కెమెరా కంటికి చిక్కారు. వారే టాలీవుడ్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి. గత కొంత కాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఈ జంట.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ హోటల్ నుంచి బయటికి వస్తున్న ఈ జంట కెమెరా కంటికి చిక్కింది. దాంతో సిద్దార్థ్, హైదరిల మధ్య ప్రేమ బంధం నిజమేనన్న వార్తలకు బలం చేకూరింది. గతంలో కొందరు హీరోయిన్ లతో లవ్ ఎఫైర్స్ నడిపినట్లు సిద్దార్థ్ పై వార్తలు కూడా వచ్చాయి. ఇక అదితి విషయానికి వస్తే ఆమె కూడా చాలా చిన్న వయసులోనే సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని విడిపోయింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇక సిద్దార్థ్, అదితిలు కలిసి ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటించారు. డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరో శర్వానంద్ కథానాయకుడు. ఈ చిత్రంతోనే ఇద్దరి మధ్య స్నేహం కుదిరిందని.. అదే ప్రేమకు దారితీసిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం సిద్దార్థ-అదితిల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.