సాధారణంగా ఒక హీరో సినిమాలో మరో హీరో గెస్ట్ అప్పీయరెన్సు చేయడం అనేది ఎప్పటినుండో జరుగుతూ వస్తోంది. కొంతమంది గెస్ట్ రోల్ చేస్తారు.. మరికొంతమంది క్యారెక్టర్స్ కూడా ప్లే చేస్తుంటారు. అయితే.. ఒక సినిమాలో మెయిన్ హీరో కాకుండా మరో హీరో ఎంట్రీ ఇవ్వడం చాలాసార్లు చూశాం. కానీ.. మెయిన్ హీరో ఉండగానే ఏకంగా పరిభాషకు చెందిన ముగ్గురు హీరోలు ఎంట్రీ ఇవ్వడం అంటే ప్రేక్షకులలో అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోండి. అదికూడా బాలీవుడ్ హీరో సినిమాలో ముగ్గురు తెలుగు హీరోలు మెరవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘కిసీకా భాయ్ కిసీకి జాన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఈద్ సందర్భంగా ఏప్రిల్ 21న సినిమాని వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. కాగా.. ఈ సినిమాలో సల్మాన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ సినిమాని ఫర్హాద్ సామ్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ లో సల్మాన్ హెయిర్ స్టైల్, లుక్ తో పాటు డైలాగ్స్ కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. వీటన్నింటికీ మించి ఇందులో తెలుగు హీరోలు వెంకటేష్, రామ్ చరణ్ లతో పాటు జగపతిబాబు మెయిన్ విలన్ గా కనిపించడం అనేది తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్ అనిపించింది.
అదేంటీ ముగ్గురు తెలుగు హీరోలన్నారు.. జగ్గూభాయ్ ని కూడా హీరోగా లెక్కేశారా? అని మీకు డౌట్ రావచ్చు. కానీ, అది నిజం కాదు. జగ్గూభాయ్ విలన్. కాబట్టి.. ఆయనకు గెస్ట్ అప్పీయరెన్సు అవసరం లేదు. సో.. మరెవరూ అనంటే.. మీరు టీజర్ ని సరిగ్గా గమనిస్తే.. వెంకీ, రామ్ చరణ్ లతో పాటు ఒక ఫైట్ షాట్ లో హీరో రానా దర్శనమిస్తాడు. చివరలో సల్మాన్ డైలాగ్ చెప్పేటప్పుడు ఒక్కసారిగా అలా వెంకీ, రానా, జగ్గూ మెరుపు తీగల్లా కనిపిస్తారు. చరణ్ వచ్చేసి ఒక సాంగ్ లో స్పెషల్ అప్పీయరెన్సు ఇవ్వనున్నాడు. సో.. టీజర్ లోని యాక్షన్ సీక్వెన్స్ లో రానాని మాత్రం ఎవరూ గుర్తించలేకపోయారనే చెప్పాలి. కాబట్టి.. రేపు విడుదలయ్యాక థియేటర్స్ లో.. సల్మాన్ సినిమా అయినప్పటికీ, తెలుగు హీరోల మాస్ హవా చూడబోతున్నారు ఆడియెన్స్. మరి ‘కిసీకా భాయ్ కిసీకి జాన్’ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.