పాన్ ఇండియా క్రేజ్ అనేది ఏ భాషకు చెందిన హీరోలైనా సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమందికి ఒకే సినిమాతో ఆ క్రేజ్ దక్కవచ్చు.. మరికొందరికి రెండు మూడు సినిమాలు చేస్తేగాని ఆ క్రేజ్ రాకపోవచ్చు. కానీ.. ఒక్కసారి ఆ ఇమేజ్ వచ్చిందంటే చాలు.. కెరీర్ దాదాపు నెక్స్ట్ వెళ్లే దశలో ఉన్నట్లే. అయితే.. ఇక్కడ కొందరికి లక్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అదే పాన్ ఇండియా రేస్ లోకి నేచురల్ స్టార్ నాని అడుగు పెట్టబోతున్నాడు.
పాన్ ఇండియా క్రేజ్ అనేది ఏ భాషకు చెందిన హీరోలైనా సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమందికి ఒకే సినిమాతో ఆ క్రేజ్ దక్కవచ్చు.. మరికొందరికి రెండు మూడు సినిమాలు చేస్తేగాని ఆ క్రేజ్ రాకపోవచ్చు. కానీ.. ఒక్కసారి ఆ ఇమేజ్ వచ్చిందంటే చాలు.. కెరీర్ దాదాపు నెక్స్ట్ వెళ్లే దశలో ఉన్నట్లే. అయితే.. ఇక్కడ కొందరికి లక్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే ఆ రేంజ్ క్రేజ్ వచ్చేస్తుంది. ఇక పాన్ ఇండియా వద్ద క్రేజ్ అందుకున్న టాలీవుడ్ హీరోలలో ముందు ప్రభాస్ ఉంటాడు. బాహుబలి, సాహో సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
ఆ తర్వాత పుష్పతో అల్లు అర్జున్.. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్.. కార్తికేయ 2తో నిఖిల్.. మేజర్ తో అడివి శేష్.. ఇలా తెలుగు నుండి ఒక్కొక్కరుగా పాన్ ఇండియా హీరోల లిస్టులో చేరుతున్నారు. అయితే.. పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ ఉన్నప్పటికీ.. సరైన హిట్ లేని హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ ఇంపాక్ట్ బాలీవుడ్ వరకు పాకింది. కానీ.. గతేడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ చేసి డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. విజయ్ కి ఉన్న క్రేజ్ కి.. లైగర్ హిట్ పడుంటే.. అతని క్రేజ్ డబుల్ అయ్యేది. లైగర్ ప్లాప్ తో పాన్ ఇండియా ఇమేజ్ అనేది విజయ్ వల్ల కాలేకపోయింది.
ఇప్పుడు అదే పాన్ ఇండియా రేస్ లోకి నేచురల్ స్టార్ నాని అడుగు పెట్టబోతున్నాడు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ సినిమాతో నాని పాన్ ఇండియా బరిలో దిగుతున్నాడు. విజయ్ కంటే ముందునుండే నానికి సూపర్ క్రేజ్ ఉన్నప్పటికీ.. తన క్రేజ్ ని ఎప్పుడు కూడా పాన్ ఇండియా వైడ్ విస్తరించుకునే ప్రయత్నాలు చేయలేదు. కానీ.. దసరాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. సో.. విజయ్ వల్ల కాని పాన్ ఇండియా ఇమేజ్ ని, నాని సాధించి చూపిస్తాడా? అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా.. దసరా సినిమా మార్చి 30న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. ప్రస్తుతానికి సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి నాని తన పాన్ ఇండియా బోణి అందుకుంటాడా లేదా చూడాలంటే అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. మరి నాని దసరాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకుంటాడా లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
#Liger Record Is Unbrokken🔥#Nani #Dasara #VijayDeverakonda #DasaraTrailer #Cinee_Worldd pic.twitter.com/qKhHeAlqIL
— cinee worldd (@Cinee_Worldd) March 14, 2023