టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో హీరో నాగశౌర్య ఒకరు. తాజాగా, నాగశౌర్య తన బ్యాచిలర్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ పలికారు. వివాహ బంధంతో ఓ ఇంటి వాడయ్యారు. కర్ణాటకకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని వివాహం ఆడారు. ఆదివారం వీరి పెళ్లి కుటుంబసభ్యులు, బంధు మిత్రుల మధ్య ఘనంగా జరిగింది. ఇక, ఈ నేపథ్యంలోనే శనివారం హల్దీ వేడుక జరిగింది. ఈ వేడుకలో కుటుంబసభ్యులు, బంధు మిత్రులు పాల్గొన్నారు. అనంతరం కాక్ టైల్ పార్టీ కూడా జరిగింది. ఈ పార్టీలో నాగశౌర్య, అనూష శెట్టికి రింగ్ తొడిగి ప్రపోజ్ చేశారు. హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా, నాగశౌర్య 2011 లో వచ్చిన ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత పలు హిట్టు సినిమాల్లో హీరోగా నటించారు. ‘ఛలో’ సినిమాతో నిర్మాతగా మారారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరో వైపు నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. తాజాగా, కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం నాగశౌర్య ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి.. నారీ నారీ నడుమ మురారీ.. పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు శరావేగంగా షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి.