అజిత్ కుమార్ చేసిన మంచి పనికి ఆ మహిళ భర్త ఎంతో సంతోషించాడు. ఓ స్టార్ హీరో అయిఉండి ఆయన అలా చేయటాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పెద్ద పోస్టు పెట్టాడు.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ మంచి తనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న పాలసీని ఫాలో అవుతూ ఉంటారు. ఫ్యాన్స్‌కు కూడా ఎంతో మర్యాద ఇస్తూ ఉంటారు. వారిని ప్రేమగా పలకరిస్తూ ఉంటారు. ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే ఎలాంటి ముహమాటం లేకుండా చేస్తారు. అలాంటి ఆయన తాజాగా, ఓ మహిళకు సహాయం చేశారు. నెలల బిడ్డతో ఇబ్బందిపడుతున్న ఆమె బ్యాగును స్వయంగా మోశారు. సదరు మహిళ భర్త కార్తీక్ ఈ సంఘటనపై తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పెద్ద పోస్ట్ పెట్టాడు. అందులో ఈ విధంగా ఉంది..
‘‘ నా భార్య గ్లాస్గో నుంచి చెన్నై ప్రయాణిస్తోంది. ఆమె మా 10 నెలల బాబుతో ఒంటరిగా ప్రయాణిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె హీరో అజిత్‌ను కలిసే అవకాశం వచ్చింది. ఆమె లండన్‌లోని హాత్రోలో ఆయన్ను కలిసింది. ఆమె కడుపు మీద బిడ్డతో పాటు రెండు చేతుల్లో ట్రావెల్ సూట్ కేస్, బేబి బ్యాగ్‌తో ప్రయాణిస్తూ ఉంది. ఇది గమనించిన ఆయన నా భార్యకు సహాయం చేయటానికి ముందుకు వచ్చారు. నా భార్య చేతిలోని బేబీ బ్యాగును ఆయన తీసుకున్నారు. ఆమె వద్దు అన్నా ఆయన వినలేదు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అన్నారు. బేబి బ్యాగును విమానం వచ్చే వరకు మోశారు. ఆ సమయంలో ఆయన చేతుల్లో ఓ సూట్ కేసు కూడా ఉంది.
విమానం వచ్చిన తర్వాత ఆ బ్యాగును నా భార్య సీటు దగ్గర పెట్టాలని క్యాబిన్ సిబ్బంది చెప్పారు. ఆయనతో పాటు వచ్చిన ఓ వ్యక్తి ‘‘ తలైవా మీరు ఎందుకు మోయటం.. నేను తీసుకు వస్తాను’’ అని అన్నాడు. అయినా అజిత్ వినలేదు. విమానాశ్రయంలోని బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కూడా నా భార్య బ్యాగును తీసుకోవటానికి అడిగింది. ఆయన వినలేదు. అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా ఆయన ఎంతో సింపుల్‌గా ఉన్నారు. అది నన్నెంతో ఇంప్రెస్ చేసింది. ఆయన ఎంతో గొప్ప మనిషి’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, అజిత్ కుమార్ గొప్ప మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.