హీరోయిన్ టబు గురించి దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 52 ఏళ్ల వయసు వచ్చినప్పటికి.. ఇంకా సినిమాల్లో రాణిస్తూనే ఉంది. ఈ వయసులో కూడా సినిమాల్లో కీలక పాత్రలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ.. బిజీగా ఉంది. టబు నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో అత్యుత్తుమ ప్రదర్శన కనబరిచి.. ఏకంగా రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు.. ఆరు సార్లు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకోవడమే కాక.. భారత్‌లో అత్యున్నత నాలుగో పౌర పురస్కారం అయిన పద్మ శ్రీ అవార్డును కూడా అందుకుంది. 37 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తుంది. హిందీ, తమిళ్ తెలుగు సినిమాలతో పాటు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది టబు.
తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన కూలీ నంబర్ 1 సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది టబు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసింది. సినిమాలకు సంబంధించిన విషయాలు తప్ప.. ఆమె వ్యక్తిగత విషయాలు ఎక్కువగా బయటకు రావు. ఇక టబు జన్మించింది హైదరాబాద్ మల్లెపల్లిలోనే. ఈ క్రమంలో తాజాగా టబు జీవితంలో చోటు చేసుకున్న ఓ చేదు సంఘటన వెలుగులోకి వచ్చింది. టబు సినిమాల్లోకి రాకముందు.. ఓ అగ్ర నటుడు ఆమెపై దాడికి యత్నించాడు. కానీ అదృష్టం కొద్ది ఆమె తప్పించుకోగలిగింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాక ఆ నటుడితో కలిసి ఎప్పుడు నటించలేదు. ఆ వివరాలు..
టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా మష్మి. ఆమె సోదరి ఫరా నాజ్ అప్పట్లో స్టార్ హీరోయిన్. ఈ క్రమంలో టబు.. సోదరి వెంట షూటింగ్ లోకేషన్, పార్టీలకు వెళ్లేది. అలా వెళ్లిన సమయంలో ఓ సారి అగ్ర నటుడి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యింది. దీని గురించి అప్పట్లో మీడియాలో కూడా వచ్చింది. ఇక ఒరిస్సా పోస్ట్ 1986లో వచ్చిన ఓ కథనం ప్రకారం.. టబు సోదరి ఫరా నాజ్.. జాకీ ష్రాఫ్ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతుంది. దీని షూటింగ్ మారిషస్‌లో జరిగింది. ఈ నేపథ్యంలో టబు కూడా తన సోదరి ఫరా నాజ్‌తో కలిసి వెళ్లింది.
ఈ క్రమంలో సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న డేనీ డెంగ్జోపా అనే నటుడు.. అక్కడే ఉన్న తన ఇంట్లో చిత్ర బృందానికి పార్టీ ఇచ్చాడు. టబు తన సోదరి ఫరా నాజ్‌తో కలిసి పార్టీకి వెళ్లింది. ఈ క్రమంలో ఫరా నాజ్.. పూటుగా తాగి అక్కడే పడిపోయింది. సోదరిని అలాంటి పరిస్థితిలో చూసిన టబు.. భయంతో వణికిపోయింది. అక్కడి నుంచి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తుండగా.. మరో ప్రమాదం వచ్చి పడింది. పార్టీకి వచ్చి.. ఫుల్‌గా మందు తాగి మత్తులో తూలుతున్న జాకీ ష్రాఫ్ టబుపై వేధింపులకు పాల్పడ్డాడు. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు టబు శాయశక్తుల ప్రయత్నించింది. ఇది గమనించిన డేనీ డెంగ్జోపా.. టబుని కాపాడి.. అక్కడి నుంచి వారిని పంపించాడు.
అయితే కొన్ని రోజుల పాటు ఈ విషయం బయటకు తెలియలేదు. అయితే ఓ సందర్భంలో ఫరా నాజ్.. జాకీ ష్రాఫ్ తన సోదరి టబు విషయంలో ఎలా ప్రవర్తించాడో వెల్లడించి అందరిని షాక్‌కు గురిచేసింది. అతడు తన సోదరిని వేధించాడని చెప్పుకొచ్చింది. అయితే టబు మాత్రం దీని గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. కానీ టబు తన కెరీర్‌లో జాకీ ష్రాఫ్‌తో లీడ్ రోల్స్‌లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే టబు ఇలాంటి నిర్ణయం తీసుకుందని సినీ వర్గాల్లో కొన్నాళ్ల పాటు జోరుగా చర్చించుకున్నారు.