ప్రముఖ బహుబాషా హీరోయిన్ హరిప్రియ, కేజీఎఫ్ నటుడు వశిష్ట సింహ ప్రేమలో ఉన్నారంటూ గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ దుబాయ్ నుండి బెంగళూరుకి తిరిగివస్తూ ఎయిర్ పోర్టులో మీడియా కంటబడ్డారు. దీంతో వారి ప్రేమ విషయం కాస్తా దావాలనంలా అంతా పాకిపోయింది. ఈ నేపథ్యంలోనే హరిప్రియ, వశిష్టలు నిశ్చితార్థం చేసుకోబుతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక, ఆ వార్తలే నిజమయ్యాయి. నిన్న వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. హరిప్రియ ఇంటి దగ్గర ఈ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. అతికొద్ది మంది బంధుమిత్రుల మధ్య ఈ నిశ్చితార్థ వేడుక జరిగినట్లు సమాచారం. పెళ్లి ఎప్పుడన్నది తెలియరాలేదు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, హరిప్రియ 2007లో వచ్చిన బడి అనే తుళు సినిమాతో సినీ పరిశ్రమకు వచ్చారు. తర్వాత కన్నడలో వరుస సినిమా ఆఫర్లు అందుకున్నారు. ‘‘కనగవేల్ కాక’’ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టారు. ‘‘తకిటతకిట’’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో పిల్ల జమిందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహ సినిమాలు చేశారు. కన్నడలో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. బుల్లితెరలోనూ ఓ సీరియల్‌లో నటించారు. ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరించారు. ఇక, వశిష్ట సింహ విషయానికి వస్తే.. కేజీఎఫ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు.
కమల్ అనే పాత్రలో కనిపిస్తారు. గతంలో కన్నడలో చాలా సినిమాలు చేసినా రాని గుర్తింపు ఆయనకు కేజీఎఫ్‌తో వచ్చింది. ఆ తర్వాతినుంచి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక, హరిప్రియ, వశిష్ట మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందో తెలీదు కానీ, పెళ్లి వరకు వేగంగా వచ్చేశారు. గతంలో ఓ సారి వశిష్ట పుట్టినరోజు సందర్భంగా హరిప్రియ, వశిష్టతో డ్యాన్స్ చేసిన ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు పార్ట్‌నర్ అని రాసుకొచ్చారు. వశిష్ట దీనికి బదులిస్తూ ‘‘ థాంక్స్ పార్ట్‌నర్’’ అని అన్నాడు. హరిప్రియ పుట్టినరోజు సందర్భంగా ఇది రివర్స్‌లో జరగటం విశేషం.