హీరోయిన్లు, వాళ్ల పెళ్లి అనేది నెటిజన్లకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎంత వద్దనుకున్నా సరే సదరు బ్యూటీ, ఎవరిని పెళ్లి చేసుకోనుంది, ఎవరతడు? అనే విషయాలు తెగ సెర్చ్ చేస్తారు. హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు కాబట్టి కొన్నిరోజుల్లో అతడు కూడా సెలబ్రిటీ అయిపోతాడు. ఇదంతా ఎందుకు అంటే హీరోయిన్ హన్సిక.. త్వరలో పెళ్లి చేసుకోనుంది. తనకు కాబోయే భర్త సొహైల్ కతూరియాని ఈ మధ్యే పరిచయం చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. కాకపోతే ఇప్పుడు ఆ వ్యక్తి గురించి సెర్చ్ చేయగా కొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక, కొన్నిరోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోలతో నటించింది. హిట్స్ కొట్టింది. ఇక ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 15 ఏళ్లుపైనే అయిపోయింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోనుందని గత కొన్నాళ్ల నుంచి వార్తలొస్తున్నాయి. వీటిపై తాజాగా క్లారిటీ ఇచ్చిన హన్సిక.. సొహైల్ తనని ఈఫిల్ టవర్ దగ్గర ప్రపోజ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలో పెళ్లి చేసుకున్నట్లు రివీల్ చేసింది. రాజస్థాన్ జైపుర్ లోని 450 ఏళ్ల నాటి ‘ముందోతా ఫోర్ట్ ప్యాలెస్’ లో వీరి పెళ్లి డిసెంబరు 4న జరగనున్నట్లు తెలుస్తోంది.
ఇక సొహైల్ గురించి మాట్లాడుకుంటే.. హన్సికకు అతడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. హన్సికకు బిజినెస్ పార్ట్ నర్ మాత్రమే కాదు బెస్ట్ ఫ్రెండ్ సోదరుడు కూడా. ఇక్కడ వరకు చాలామందికి తెలుసు. కానీ 2016లో రింకీ అనే అమ్మాయి సొహైల్ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం చాలామందికి తెలీదు. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది.. అదేంటంటే సొహైల్ మ్యారేజ్ కి హన్సిక కూడా అటెండ్ అయింది. గోవాలో జరిగిన ఈ పెళ్లి సంగీత్ లో హన్సిక డ్యాన్స్ చేసింది. స్విమ్మింగ్ పూల్ లోనూ సొహైల్-రింకీతో కలిసి ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన పెళ్లి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.