వెండితెరను ఏలే నటీ నటుల్లో రాజకీయాల్లో రాణించినవాళ్లు తక్కువే. ఈమె కూడా అలాంటిదే. తమిళ, తెలుగు, మలయాళ సినిమాల్లో రాణించిన ఈమె ఇప్పటికీ వెండితెరపై తళుక్కుమంటోంది. ఈ హీరోయిన్ చిన్ననాటి ఫోటోను మీకోసం అందిస్తున్నాం. ఫోటో చూసి ఆమెవరో గుర్తు పట్టగలరా..
ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో టాప్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని టాప్ హీరోలతో పనిచేసింది. ఇప్పుడు కూడా సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్‌లతో నటిస్తోంది. తెలుగు ఒక్కటే కాకుండా హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో ప్రతిభ చూపిస్తోంది. కుటుంబం మొత్తం సినీ నేపధ్యం కలిగినవారే. మొదటి రెండు వివాహాలు విడాకులకు దారి తీసినా సీనియర్ నటుడితో జరిగిన మూడో వివాహంతో సెటిల్ అయింది. అటు రాజకీయాల్లో కూడా రాణిస్తున్న ఆ నటి మరెవరో కాదు..రాధికా శరత్ కుమార్.
ఇప్పటి వరకూ రెండు నంది అవార్డులు, మూడు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు ఒక నేషనల్ ఫిల్మ్ అవార్డు గెల్చుకుంది. భారతీరాజా తెరకెక్కించిన సినిమాతో కెరీర్ ప్రారంభించిన రాధికాకు తెలుగు, తమిళ పరిశ్రమల్లో మంచి పేరుంది. తెలుగులో చిరంజీవి, బాలయ్య, కృష్ణంరాజు, కమలహాసన్ సహా చాలామందితో నటించింది. ఈమె బాల్యం నాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే ఈ చిత్రం.