పై ఫొటో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్.. ఆమె అందానికి, అభినయానికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో పరభాషా నటీమణులు స్టార్‌లుగా వెలుగొందటం ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే, వారిలో తెలుగింటి అమ్మాయిలా కనిపించే వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న పాప కూడా ఒకరు. ఆ పాప తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. అన్ని భాషల్లోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు అభిమానుల్ని సంపాదించుకున్నారు.
సినిమాల్లో స్టార్‌గా బిజీగా ఉన్న సమయంలోనే అనుకోని విధంగా ఆమెపై దారుణం జరిగింది. భావనతో పాటు నటించిన ఓ స్టార్ హీరో ఆమెపై కక్ష గట్టాడు. తన మనుషులతో ఆమెపై లైంగిక వేధింపులు చేయించాడు. దీంతో ఆమె సినిమాలకు కొంతకాలం దూరం అయ్యారు. ఆ సమయంలోనే తన ప్రియుడ్ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొంతకాలానికి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇప్పటికే ఆమె ఎవరో అర్థం అయి ఉంటుంది. ఆ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు.. కేరళ అందం భావనా మీనన్.
భావన ‘ఒంటరి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. హీరో, మహాత్మ, నిప్పు సినిమాల్లో నటించారు. మహాత్మలో ఆమె నటనకుగాను మంచి మార్కులు పడ్డాయి. నిప్పు సినిమా తర్వాత ఆమె తెలుగు తెరకు దూరం అయ్యారు. ప్రస్తుతం కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. మలయాళంలో ‘హంట్’.. కన్నడలో ‘కేస్ ఆఫ్ కొండన’, పింక్.. తమిళంలో ది నోట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ నాలుగు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.