వచ్చిన ఒక మంచి అవకాశంతో స్టార్ హీరో,హీరోయిన్ల స్థాయికి ఎదిగినవారున్నారు. అలాంటి వారిలో ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఒకరు. చిన్న వయస్సులోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చింది.
‘ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్’అంటూ తనలోని యాక్టింగ్ టాలెంట్ నిరూపించుకునేందుకు పల్లెటూరు కట్టుబొట్టుతో సంగీత చెప్పే డైలాగ్ ఎంతో ఫేమస్ అయ్యింది. అది నిజ జీవితానికి వర్తింపజేసుకున్నారు నటీ నటులు. వచ్చిన ఒక మంచి అవకాశంతో స్టార్ హీరో, హీరోయిన్ల స్థాయికి ఎదిగినవారున్నారు. అలాంటి వారిలో ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఒకరు. చిన్న వయస్సులోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చింది. అయితే ఆమె సినిమా ఎంపికలో వేసిన కొన్ని తప్పడగులు కారణంగా.. క్రేజీ ప్రాజెక్టులు ఆమె నుండి దూరంగా జరుగుతున్నాయి.
ఆమె మరెవ్వరో కాదూ మన బేబమ్మ అలియాస్ కృతి శెట్టి. ఉప్పెనలా తెలుగు తెరపైకి దూకి వచ్చిన ఈ చిన్నది.. ముందు హృతిక్ రోషన్ సినిమా సూపర్ 30 లో నటించింది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ మరో స్టార్ హీరోయిన్ దక్కిందనుకున్నారు అంతా. 17 ఏళ్ల వయస్సులోనే పరిశ్రమలోకి వచ్చిన ఆమె.. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్‌లో నాని సరసన నటించింది. అయితే మార్కులన్నీ సాయి పల్లవి కొట్టేసింది. తర్వాత నాగ చైతన్య సరసన బంగార్రాజు సినిమాలో నాగలక్ష్మి పాత్రలో గుర్తిండి పోయే పాత్రలో కనిపించింది. ఈ సినిమా కూడా హిట్ కావడంతో ఆమెను ఆకాశానికి ఎత్తేశారు ప్రేక్షకులు. పరిశ్రమ ఆమెను గోల్డెన్ లెగ్ అన్న ముద్ర వేసింది. కానీ అంతలోనే ఆమెకు వరుస అపజయాలు పలకరించడం మొదలు పెట్టాయి.
బైలింగ్వల్ మూవీ ద వారియర్‌తో అటు కోలీవుడ్‌లో అడుగుపెట్టింది ఈ చిన్నది. ఆ సమయంలో రెమ్యునరేషన్ కోటి వరకు తీసుకుందని టాక్. కానీ ఆ సినిమాలో విజిల్ మహాలక్ష్మి పాత్రలో ఆకట్టుకోలేకపోయింది. నితిన్ మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ వరుసగా డిజాస్టర్లు పలకరించడం మొదలు పెట్టాయి. గోల్డెన్ లెగ్ కాస్త ఐరెన్ లెగ్‌గా మారిపోయింది. కృతిని ఢీకొట్టే వారే లేరు అనుకున్న సమయంలో రాకెట్ వేగంతో వచ్చేసింది శ్రీలీల. ఒక్క సినిమా ఆమె గ్రాఫ్‌ను మార్చేసింది. ధమాకాలో ఆమె చేసిన డ్యాన్స్, ఫెర్మామెన్స్‌తో కృతికి అవకాశాలకు గండికొట్టాయని చెప్పొచ్చు. చివరకు ఆమె రావాల్సిన అవకాశాలు కూడా రావడం లేదు. అప్పటికి కృతి రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నట్లు టాక్. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా, తెలుగులో కొన్ని కథలు వింటున్నట్లు తెలుస్తోంది.