ఇప్పటికీ కొంతమంది అన్నదమ్ములు ఉంటారు. ఆస్తుల కోసం, అడుగు భూమి కోసం కాకుండా ఆత్మీయత కోసం, అనుబంధాల కోసం పడిచచ్చే అన్నదమ్ములు ఉంటారు. ఒకే బెడ్ పై పడుకునే అన్నదమ్ములు ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఒకే కంచంలో అన్నం తినే అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు? కానీ సొంత అన్నదమ్ములు కాకపోయినా బాబాయ్, పెదనాన్న పిల్లలు అయిన రాజమౌళి, కీరవాణి మాత్రం సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి ఒకే కంచంలో తిన్నారు.
అన్నదమ్ములు అంటే ఎలా ఉంటారు? బాహుబలి సినిమాలో బాహుబలి, భల్లాలదేవల్లా ఉంటారు. అన్నదమ్ములు ఎలా ఉండాలి అని సమాజాన్ని అడిగినా కూడా ఆస్తి కోసం, అడుగు భూమి కోసం ఒకరినొకరు కొట్టుకు చస్తూ ఉండాలి అని చెబుతుంది. అయితే ఇదే సమాజంలో పెళ్లిళ్లు అయిపోయి, పిల్లలు పుట్టేశాక కూడా కలిసి మెలిసి ఉండే అన్నదమ్ములను చూడ్డం అంత తేలిక కాదు. ఒక తల్లికి పుట్టిన సొంత అన్నదమ్ములే శత్రువుల్లా ఉంటున్న ఈరోజుల్లో ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, ఒకే తండ్రికి పుట్టకపోయిన గానీ సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్న సోదరులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో రాజమౌళి, కీరవాణి ఉన్నారు. డబ్బు వచ్చిందనో, కీర్తి వచ్చిందనో, మరేదో వచ్చిందనో మధ్యలో వ్యక్తిత్వాలు మార్చుకోలేదు.
ఏమీ లేని స్థితిలో ఎలా అయితే కలిసి ఉన్నారో.. ఈరోజు ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటతో ఆస్కార్ గెలిచినా కూడా అలానే ప్రేమతో, ఆప్యాయతతో ఉన్నారు. అసలు ప్రయాణం మొదలుపెట్టిందే ఇద్దరూ కలిసి. అలాంటప్పుడు ఇద్దరూ వేర్వేరు ఎలా అవుతారు. కీరవాణి లేని రాజమౌళి సినిమా ఉండదు. కీర’వాణి లేకపోతే రాజమౌళి సినిమా మూగబోతుందనడంలో ఆశ్చర్యం లేదు. అసలు రాజమౌళి సినిమాలు మాట్లాడేదే కీరవాణి సంగీతంతో. అలాంటప్పుడు రాజమౌళి కీరవాణిని ఎలా వదులుకుంటారు? ఒకరి పట్ల ఒకరు చాలా ప్రేమగా ఉంటారు. ఇద్దరూ కలిసి సినిమాకి పని చేస్తే పని రాక్షసుల్లా పని చేస్తారు. బాహుబలి సినిమా ప్రీ రిలీజ్ లో అయితే అన్నదమ్ములిద్దరూ కంటతడి పెట్టేసుకున్నారు. అన్న కీరవాణి ప్రేమకి రాజమౌళి ఏడ్చేశారు. అంత ప్రేమ ఒకరంటే ఒకరికి.
రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వరకూ కలిసే ఉన్నారు. కలిసే పని చేశారు. కలిసే సినిమాని ఆస్కార్ బరిలో నిలిపారు. కలిసే మన అచ్చ తెలుగు ఊర నాటు పాటకు ఆస్కార్ తీసుకొచ్చారు. తెలుగు సినీ గ్యాలరీలో ఆస్కార్ అవార్డును చేర్చారు. తెలుగు సినిమాకి ఆస్కార్ రావడం అనేది తెలుగు వారి కల. ఆ కలను అన్నదమ్ములిద్దరూ నెరవేర్చారు. తెలుగు సినిమా పాటకు ఆస్కార్ రప్పించి తమ దమ్ము చూపించారు ఈ అన్నదమ్ములిద్దరూ. ఇంకో పాతిక, ముప్పై ఏళ్ళు గడిచినా ఇలానే ఇండస్ట్రీ మురిసిపోయేలా గడిపేస్తారు. అలాంటి ఈ అన్నదమ్ములకు సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మామూలుగా అన్నదమ్ములు అంటే కలిసి ఉంటారు. మహా అయితే కలిసి భోజనం చేస్తారు. కానీ ఒకే కంచంలో కలిసి తినడం ఎప్పుడైనా చూశారా? ఎక్కడో ఒక చోట ఉంటారు. చిన్నప్పుడంటే కలిసి తింటారు గానీ ఎదిగాక తినడం అంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ రాజమౌళి, కీరవాణి మాత్రం ఒకే ప్లేటులో చపాతీ తిన్నారు. ఈ అరుదైన సన్నివేశం చాలా ఏళ్ల క్రితం జరిగింది. కానీ ఇప్పటికీ ఈ అన్నదమ్ములు ఇలానే ఎంతో ప్రేమతో కలిసిమెలిసి ఉంటున్నారు. అప్పట్లో ఎలా ఉన్నారో? ఇప్పుడు కూడా అలానే ఉంటున్నారు. తాము కలిసి పని చేసిన సినిమాకి ఆస్కార్ వచ్చినా కూడా ఇలానే ఉంటున్నారు. ఇకపై కూడా ఇలానే కలిసిమెలిసి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్న రాజమౌళి, కీరవాణిలపై మీ అభిప్రాయమేమిటి? మీరు కూడా ఇలానే కలిసిమెలిసి ఉంటున్నారా? ఇలానే ఒకే ప్లేటులో కలిసి తింటున్నారా? మీ మూమెంట్స్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.