కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సాంగ్ ”జంబలకిడి జారు మిఠాయి.” మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు రాబట్టలేక నష్టాలను మూటగట్టుకుంది. ఇక జిన్నా మూవీలో జంబలకిడి జారు మిఠాయి సాంగ్ ఏ స్థాయిలో ట్రోల్స్ కు గురయ్యిందో మనందరికి తెలిసిందే. తాజాగా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలోకి వచ్చిన జిన్నా మూవీ రికార్డ్ స్థాయి వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ జంబలకిడి జారు మిఠాయి వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ ను షేక్ చేసింది. ఈ సాంగ్ లో మంచు విష్ణు తనదైన మాస్ స్టెప్పులతో అలరించాడు.
జంబలకిడి జారు మిఠాయి.. కొన్ని రోజుల ముందు ఏ మీమ్ పేజీ ఓపెన్ చేసినా, ఏ ట్రోల్స్ ఛానల్ ఓపెన్ చేసినా ఈ సాంగే వినపడేది.. కనపడేది. అంతాలా ఈ పాట జనాల్లో నానింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో మంచు విష్ణు గత సినిమాల కంటే భిన్నంగా తన డ్యాన్స్ ఫర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. మాస్ స్టెప్పులతో అభిమానులను అలరించాడు. మరోవైపు సన్నీలియోన్ కూడా ఎప్పటిలాగే తన అందచందాలతో కుర్రాళ్లకు కనువిందు చేసింది. ఈ సాంగ్ లో మత్తెక్కించే చూపులతో యువకుల గుండెల్ని గాయపరిచింది. ఈ పాట ఎంత దారుణంగా ట్రోల్స్ కు గురి అయినప్పటికీ యూట్యూబ్ లో అదరగొడుతోంది. సాంగ్ రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ సంపాదిస్తూ.. ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఇక జిన్నా సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహించగా.. పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్, వెన్నెల కిశోర్, సునీల్, సురేష్, నరేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. ఏవిఏ ఎంటర్టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సారథ్యంలో మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.