నిత్యం మనం అనేక రోడ్డు ప్రమాదాలు చూస్తూ ఉంటాము. ఇటీవల కాలంలో ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగతోంది. ముఖ్యంగా కారు, బైక్ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. వీటికి మితి మీరిన వేగం కారణంగా ప్రమాదాల బారినపడుతున్నారు. తాజాగా ఓ కారు ఏకంగా 100 అడుగుల ఎత్తున ఎగిరి పడింది. దీంతో స్థానికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. పోలీసులకు సైతం ఫోన్ చేసి సమాచారం అందిచారు. అనంతరం అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. ఇంతకు విషయం ఏంటంటే.. అక్కడ జరిగింది ప్రమాదం కాదు.. మరి అసలు సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తూ.. కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం ఘోస్ట్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఊటిలో శరవేగంగా జరుగుతుంది. ఓ యాక్షన్ సీన్ ను చిత్రికరిస్తున్న సందర్భంగా కారును గాలిలోకి లేపారు స్టెంట్ మాస్టర్. దీంతో కారు ఒక్కసారిగా కొన్ని అడుగుల ఎత్తులో గాల్లోకి ఎగిరింది. ఈ విషయం తెలియని టీ ఎస్టేట్ లో పనిచేసే కార్మికులు ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా కారు ప్రమాదం జరిగిందని భావించి భయంతో పరుగులు పెట్టారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరకున్న పోలీసులు అక్కడికి వచ్చి చూడగా అది సినిమా షూటింగ్ అని తెలిసింది. పోలీస్ విచారణలో సినిమా షూటింగ్ లో కారు స్టంట్ చిత్రీకరిస్తునట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. దాంతో అక్కడి స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఊటీ టీ ఎస్టేట్ కార్మికులను ఉలిక్కిపడేలా చేసింది.
— K I N G (@KingKalyanPK) April 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.